గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు…
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు.
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పనికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండగా.. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అందుకు సంబంధించిన సమాచాారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
జగన్.. తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.50 కోట్ల ప్రభుత్వ ధనంతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. " సీఎం హోదాలో తాను తీసుకున్న ఫర్నిచరును జగన్ తిరిగి అప్పగించ లేదు.
Telugu Desam Party: ఏపీ సీఎం జగన్‌కు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగలేఖ రాశారు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దిబ్బలు, ద్వీపాల్లో యధేచ్ఛగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని ఎమ్మెల్యే అనగాని తన లేఖలో ప్రస్తావించారు. జూద కేంద్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని గుర్తుచేశారు. రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.…
బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అనగాని నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. రేపల్లెలోని పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తామని శనివారం నాడు టీడీపీ ప్రకటించింది. మద్యం మరణాలపై టీడీపీ వేసిన నిజనిర్ధారణ కమిటీ బాధిత కటుంబాలను కలిసేందుకు సిద్ధమైంది. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ…
సినిమా టికెట్ల ధరల విషయంలో ఆ ఎమ్మెల్యే సొంతపార్టీ హీరోనూ బుక్ చేశారా? రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో పార్టీ ఉండగా.. ఆయన కామెంట్స్ టీడీపీ శిబిరాన్నే ఇరుకున పెట్టేలా ఉన్నాయా? తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సినిమా టికెట్ ధరలపై టీడీపీ నేతల ఆసక్తికర కామెంట్స్సినిమా టిక్కెట్ల వ్యవహారం ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్. టిక్కెట్ రేట్లు మొదలుకుని.. థియేటర్ల సీజ్ వరకు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా ఉంది. సినీ ఇండస్ట్రీకి చెందిన…
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఓ వైపు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి.. సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. మరోవైపు.. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సినీ హీరోలు ఎవరూ ఈ వ్యవహారంపై స్పందించొద్దు అంటున్నారు సినీ పరిశ్రమలోని పెద్దలు.. అయినా అక్కడక్కడ కొంతమంది టికెట్ల ఇష్యూపై స్పందిస్తూనే ఉన్నారు.. ఇదే సమయంలో సినీ పెద్దలపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సీరియస్ కామెంట్లు చేశారు.. రాష్ట్రంలో థియేటర్ల…