Minister Anagani Satya Prasad: రెవెన్యూ శాఖను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. సచివాలయంలో రెవెన్యూ, స్టాంప్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఇంత పెద్ద భాధ్యత ఊహించలేదు.. కానీ, నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ భాద్యతలు ఇచ్చారు.. ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా పనిచేస్తాను అన్నారు.. రెవెన్యూ డిపార్టమెంట్‌లో ఉన్న పాలసీలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయించాలన్నారు. గతంలో జరిగిన అవినీతిపై వెలికితీత ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు దోవలో పేద ప్రజలకు అన్యాయం చేసిన వారిపై విచారణ జరిపిస్తాం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Read Also: Kishan Reddy: నితిన్ గడ్కరితో కిషన్ రెడ్డి సమావేశం.. ప్రాజెక్టుల అభివృద్ధిపై చర్చ
ఇక, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు ఉంటాయన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ సర్వే వల్ల రైతులకి ప్రయోజనం ఉండాలన్న ఆయన.. రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదని హితవుపలికారు.. తనకు అప్పగించిన రెవెన్యూ శాఖను దేశంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా అన్నారు. మరోవైపు నాకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్..