రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ చింతకాయల ఆయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. ఆక్రమించిన స్థలాల్లో లే అవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రిని స్పీకర్ ప్రశ్నించారు. స్టేజ్‌ల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదని, నియంత్రణ ఉండాలన్నారు. పదవులు, అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దని.. మన హయాంలో ఏం చేశామో అదే ముఖ్యం అని పేర్కొన్నారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని స్పీకర్ ఆయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరడ్కో ప్రాపర్టీ షోలో…
Minister Anagani Satya Prasad: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారం అవుతున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.. ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా…
Minister Anagani: మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కారణంగా ఇవాళ విడుదల చేయాల్సిన కొత్త పాస్‌బుక్‌ల ఆవిష్కరణ వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. వారం లేదా 10 రోజుల లోపులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పాస్‌బుక్‌లను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
Minister Anagani: స్వర్ణాంధ్ర విజన్- 2047లో భాగంగా డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్(DVAPU) పీ4 కార్యక్రమంపై జరిగిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్-1 గా ఉండేలా సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేశాడని తెలిపారు.
మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలు అంటే బలం, చైతన్యం కలిగి ఉన్నారు.. బీసీలు అంటే ముందుండి నడిపించే వాళ్ళని నిరూపించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. గత పాలకులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు అని ఆరోపించారు.
ప్రజలు చారిత్రక తీర్పునిచ్చన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని సూచించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. సరిగ్గా ఏడాది క్రితం రాష్ర్టంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డ్ పడిందన్న ఆయన.. ప్రజలను వేధించి వేయించుకు తిన్న సైకో నేతకు చాచి కొట్టినట్లు ప్రజలు బుద్ది చెప్పారని పేర్కొన్నారు..
Minister Anagani: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఎప్పుడూ చూడని ప్రగతి, సంక్షేమం ప్రస్తుతం కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వీటిని చూసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడుపు మండుతోంది అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం అయింది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ చివరి లోగా దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘పరిపాలనా విధి విధానాలు అందరికి…
Minister Anagani: జగన్ రెడ్డికి కావాల్సింది ప్రతిపక్ష హోదానే ప్రజా సమస్యలు కాదు అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శాసన సభా సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే ఈరోజు జగన్ రెడ్డి సభకు వచ్చారు.. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఏపీ అసెంబ్లీలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ప్రజా సమస్యల్నీ సమర్ధవంతంగా లేవనెత్తారు.
సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో చాలామంది బీసీ నేతలు కీలక పదవుల్లో ఉన్నారని, ఇదంతా సీఎం చంద్రబాబు ఘనతే అని మంత్రి అనగాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…