పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తుఫాన్ అరెస్టుకు వ్యతిరేకంగా అమృత్‌పాల్ మద్దతుదార్లు వేలాది మంది తుపాకులు, తల్వార్లతో అజ్నాలా పోలీస్‌స్టేషన్ పైకి దండెత్తారు.
Scoot Airlines Incident: ఇటీవల బెంగళూర్ విమానాశ్రయంలో 50 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది ఇండిగో ఫ్లైట్. ఈ ఘటన మరవక ముందే సింగపూర్ కు చెందిన బడ్జెట్ ఎయిర్ లైనర్ ‘స్కూట్ ఏయిర్ లైన్స్’ 35 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం పంజాబ్ అమృత్ సర్ నుంచి సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే విమానం బుధవారం సాయంత్రం 7.55 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది.…
Icon Star: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భార్య స్నేహారెడ్డి అంటే ఎంతో ప్రేమ. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న బన్నీ తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. అలానే స్నేహారెడ్డితో పాటు పిల్లలను తీసుకుని అవుటింగ్ కూ వెళుతుంటాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కన్పించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన “కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC15 Rc షూటింగ్ లో బిజీగా ఉండడం మూలంగా, ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే…
RRR తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ పై దృష్టి పెట్టారు. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వలో చెర్రీ నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్లాన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణకు చిత్రబృందం మొత్తం పంజాబ్, అమృత్‌సర్‌కి వెళుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో కొన్ని షెడ్యూల్స్‌ని పూర్తి చేశారు మేకర్స్. ఇక…
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే థర్డ్ వేవ్ ఎంటర్ అయినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిస్క్, ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కు పంపుతున్నారు. శాంపిల్స్‌ను జీనోమ్…
ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరిపోతున్నాయి… సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకి అసలు పొసగకుండా తయారవుతోంది పరిస్థితి.. కాంగ్రెస్ అధిష్టానం, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుని సిద్ధూకి పీసీసీ చీఫ్ పోస్టు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి సద్దుమనిగినట్టు కనిపించడంలేదు.. ఇక, తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇవాళ సిద్ధూ సమావేశం అయ్యారు.. అమృత్‌సర్‌లోని…
కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ లీడర్‌ను కోల్పోయింది… మాజీ గవర్నర్, పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌ఎల్ భాటియా కన్నుమూశారు.. ఆయన వయస్సు 100 సంవత్సరాలు.. వయోభారంతో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆయన… శుక్రవారం అస్వస్థతకు గురికాగా.. అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. అయితే, చికిత్స పొందుతున్న భాటియా పరిస్థితి విషమించి… ఇవాళ కన్నుమూశారు.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన… అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి 1972 నుంచి 6 సార్లు ఎంపీగా…