RRR తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ పై దృష్టి పెట్టారు. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వలో చెర్రీ నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్లాన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణకు చిత్రబృందం మొత్తం పంజాబ్, అమృత్‌సర్‌కి వెళుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో కొన్ని షెడ్యూల్స్‌ని పూర్తి చేశారు మేకర్స్. ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీకి ఇది మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్. కియారా అద్వానీ రెండోసారి రామ్ చరణ్‌తో కలిసి నటిస్తోంది. వీరిద్దరూ 2019లో వచ్చిన “వినయ విధేయ రామ”లో జతకట్టారు.
Read Also : Beast Telugu Trailer : విజయ్ ‘బీస్ట్’ తెలుగు ట్రైలర్ లో పొలిటికల్ వాసన…!
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నారు. RC15 తమిళం, తెలుగు, హిందీతో సహా పలు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో లీకైన పిక్ ప్రకారం చెర్రీ తండ్రీకొడుకులుగా కన్పించబోతున్నాడని టాక్ నడుస్తోంది. మరోవైపు చెర్రీ… కొరటాల శివ సామాజిక, రాజకీయ చిత్రం “ఆచార్య”లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.