Shiv Sena leader shot dead : పంజాబ్ లోని అమృత్ సర్ లో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల ఎదుటే శివసేన నేత సుధీర్ సూరి దారుణ హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి సుధీర్ సూరిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన స్పాట్లోనే కుప్పకూలాడు. ఆలయం వెలుపల ఉద్ధవ్ థాక్రే శివసేన వర్గానికి చెందిన కొందరు నేతలు నిరసన తెలుపుతుండగా అక్కడి గుంపులోంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి
కాల్పులకు ఉపయోగించిన ఏ30 పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. షూటింగ్ ప్రదేశం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరుపుతూ కెమెరాకు చిక్కాడు. ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల తర్వాత స్థానిక నేతలు నిరసనలకు దిగారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో లేకుండా పోయాయని శివసేన పంజాబ్ అధ్యక్షుడు యోగిరాజ్ శర్మ ఆరోపించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని కొద్ది సేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సుల్తాన్‌విండ్ ప్రాంతానికి చెందిన సందీప్ సింగ్‌గా గుర్తించారు. ఘటన ప్రాంతానికి మరో ముగ్గురితో కలిసి ఎస్‌యూవీలో వచ్చాడని, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Jabardasth Anchor Rashmi: జబర్దస్త్ నుంచి రష్మి ఔట్? ప్రోమోలో కొత్త యాంకర్!
અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીને શુક્રવારે ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગોપાલ મંદિરની બહાર કચરામાં ભગવાનોની મૂર્તિઓ મળવાના વિરોધમાં તેઓ સમર્થકો સાથે ધણાં કરતા હતા ત્યારે આ બનાવ બન્યો છે.#Shivsena #Amritsar #SudhirSuri pic.twitter.com/wpx432RO7Y
— Gujarat Tak (@GujaratTak) November 4, 2022