Clash With Cops: అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్ ముట్టడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clash With Cops: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘వారీస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తుఫాన్ అరెస్టుకు వ్యతిరేకంగా అమృత్‌పాల్ మద్దతుదార్లు వేలాది మంది తుపాకులు, తల్వార్లతో అజ్నాలా పోలీస్‌స్టేషన్ పైకి దండెత్తారు. తల్వార్లతో పోలీసులపై దాడి చేస్తూ స్టేషన్‌లోకి చొచ్చుకుని పోయారు. నిరసనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
లవ్‌ప్రీత్ తుఫాన్‌ను పోలీసులు అరెస్టు చేసి చిత్ర హింసలు పెడుతున్నారని అమృత్‌పాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమృత్ పాల్ సింగ్ తన అనుచరులతో కలిసి జల్పుర్ ఖైరా ప్రాంతం నుంచి అజ్నాలాకు భారీ ర్యాలీగా బయల్దేరారు. అక్రమంగా అరెస్టు చేసిన లవ్‌ప్రీత్‌ను విడుదల చేయకపోతే తమ సొంత ప్లాన్‌ను అమలు చేస్తామని పోలీసులను హెచ్చరించారు.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
Read Also: Kodali Nani: చంద్రబాబు భార్య కోసం బయట, కొడుకు కోసం లోపల ఏడుస్తాడు..
‘వారిస్ పంజాబ్ దే’ గ్రూప్ చీఫ్ అమృతపాల్ సింగ్ అనుచరులు లవ్‌ప్రీత్ తూఫాన్ అరెస్టుకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని.. ఒక్క గంటలో కేసును రద్దు చేయకపోతే ఇక ఏం జరిగినా దానికి పాలనా యంత్రాంగానిదే బాధ్యత అని.. మేమేమీ చేయలేమని భావిస్తున్నామని అని అమృతపాల్ సింగ్ అన్నారు. ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిసింది. గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’ గ్రూప్‌కు అమృతపాల్ సింగ్ అధిపతి.
#WATCH | Punjab: Supporters of 'Waris Punjab De' Chief Amritpal Singh break through police barricades with swords and guns outside Ajnala PS in Amritsar
They've gathered outside the PS in order to protest against the arrest of his (Amritpal Singh) close aide Lovepreet Toofan. pic.twitter.com/yhE8XkwYOO
— ANI (@ANI) February 23, 2023
#WATCH |Amritsar | 'Waris Punjab De' chief Amritpal Singh says, "…FIR registered only with a political motive. If they don't cancel the case in 1hr, Admin will be responsible for whatever happens next…They think we can't do anything, so this show of strength was necessary…" pic.twitter.com/Cl5Tz5b9wS
— ANI (@ANI) February 23, 2023
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?