Scoot Airlines: 35 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం.. ఎయిర్‌లైన్స్ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scoot Airlines Incident: ఇటీవల బెంగళూర్ విమానాశ్రయంలో 50 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది ఇండిగో ఫ్లైట్. ఈ ఘటన మరవక ముందే సింగపూర్ కు చెందిన బడ్జెట్ ఎయిర్ లైనర్ ‘స్కూట్ ఏయిర్ లైన్స్’ 35 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం పంజాబ్ అమృత్ సర్ నుంచి సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే విమానం బుధవారం సాయంత్రం 7.55 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మూడు గంటల ముందే మధ్యాహ్నం 3.45 గంటలకు వెళ్లింది.
Read Also: Farzi: నకిలీ నోట్ల కుంభకోణం వెనుక కె కె మీనన్!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
విమానంలో 263 మంది సకాలంలో విమానాశ్రయానికి చేరుకుని సింగపూర్ వెళ్లిపోయారు. మరో 35 మందికి సమాచారం లేకపోవడంతో విమానాన్ని అందుకోలేకపోయారు. 35 మంది తమ ఫ్లైట్ మిస్సవడానికి బుకింగ్ ఏజెంట్ కారణమని అమృత్‌సర్ విమానాశ్రయం డైరెక్టర్ వికె సేథ్ ఆరోపించారు. బుకింగ్ ఏజెంట్లందరికీ సకాలంలో సమాచారం అందించారు, వారంతా తమ ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసారు. కానీ ఒక ఏజెంట్ మాత్రమే ప్రయాణికులకు రీషెడ్యూల్ అయిన సమయాన్ని తెలియజేయలేదని సేథ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్కూట్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేసింది. ప్రతీకూల వాతావరణం కారణంగానే విమానం రీషెడ్యూల్ చేయబడిందని ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. బాధితులకు క్షమాపణలు చెబుతూ.. వారికి అవసరమైన సహాయం చేస్తామని వెల్లడించారు. స్కూట్ ఎయిర్ లైన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ అనుబంధ సంస్థ. బడ్జెట్ ప్రయాణాలకు స్కూట్ ఎయిర్ లైన్స్ పేరొందింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!