హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆమె.. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, తనకు ఎదురైన అనుభవాలు, కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు.. తదితర అంశాలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. నేను ఎవ్వరిని కించపరచటం లేదు.. కానీ, నన్ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమిత్ షాతో అన్ని అంశాలపై చర్చించాను.. ప్రజలకు కావాల్సిన అన్ని అంశాలు చర్చకు వచ్చాయన్న ఆమె.. ఈ నెల 11న భద్రాచలం వెళ్తానని.. రోడ్ మార్గాన మాత్రమే ప్రయాణిస్తానని వెల్లడించారు.
Read Also: Adimulapu Suresh: సీఎం జగన్ కోసం తల కోసుకోవడానికైనా సిద్ధం..!
నేను ఈ విషయాలను ప్రజల ముందు పెడుతున్నాను.. సోదరిగా నైనా నాకు గౌరవం ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు గవర్నర్ తమిళిసై.. నన్ను అవమానించారన ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. కానీ, రాజ్ భవన్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడయినా రావొచ్చు అన్నారు.. నాతో ఉన్న సమస్యలపై చర్చించండి అని సూచించిన ఆమె.. గౌరవం ఇవ్వటం లేదన్నది మాత్రం వాస్తవం అన్నారు.. రాజ్ భవన్‌ను గౌరవించాలి స్పష్టంగా చెప్పేశారు.. నేను ఏది మాట్లాడినా ప్రజల కోసమే.. ప్రజలకు మేలు జరిగేలా హోం మంత్రితో చర్చించామన్నారు. ఎవరి సహకారం అందకపోయినా ముందుకు వెళ్తానన్న ఆమె.. తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలిసిందేనన్నారు. నేను మేడారం వెళ్తే అధికారులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ పర్యటించాలంటే రోడ్డు మార్గమే దిక్కంటూ వ్యాఖ్యానించారు.. శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం వెళ్తానని వెల్లడించిన ఆమె.. ఈ మధ్యే యాదాద్రికి వెళ్తే ఒక్క అధికారి రాలేదన్నారు. ఇక, తన మేడారం పర్యటనలో ఏం జరిగిందో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మీడియాకు చెప్పారనే విషయాన్ని గుర్తుచేశారు గవర్నర్ తమిళిసై. కాగా, ఇప్పటికే రాజ్‌భవన్‌కు తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ పెరగగా.. గవర్నర్ ఢిల్లీ పర్యటన, ఆమె వ్యాఖ్యలతో మరింత దుమారం రేగేలా ఉంది.