KTR: ప్రధాని మోడీ, అమిత్‌షాపై కేటీఆర్ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఓవైపు పెరిగిపోతున్న పెట్రో ధరలు.. మరోవైపు హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు విసిరారు.. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో దేశం అగ్రస్థానంలోకి దూసుకెళ్లిందంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కొనుగోలు శక్తి సమానత్వం అంచనా ఆధారంగా ప్రపంచంలో భారత్‌లో ఎల్‌పీజీ ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.. ఇక, పెట్రోలు ధరలు అధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్ 3లో ఉందన్న ఆయన.. డీజిల్ ధరల్లో 8వ స్థానంలో ఉందంటూ దుయ్యబట్టారు.
Read Also: Chandrababu: కరెంట్ పీకుతున్న జగన్‌ను.. పవర్ నుంచి పీకేందుకు..!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
ఇక, హిందీ భాషపై అమిత్‌షా తాజాగా చేసిన వ్యాఖ్యలను సైతం వదలకుండా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.. తాను మొదట భారతీయుడ్ని అయినందుకు గర్వపడుతున్నాను.. ఆ తర్వాత తెలుగువాడ్ని… తదుపరి తెలంగాణవాసినంటూ పేర్కొన్న ఆయన.. తాను మాతృభాష తెలుగులో మాట్లాడతాను.. ఆ తర్వాత ఆంగ్లం, హిందీ, కొంచెం ఉర్దు భాషలో కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చారు.. అంతే, కానీ… ఆంగ్ల భాషకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలంటూ మాపై రుద్దడం ఆపాలంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. భారతదేశంలో ఈ తరహా వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన సువిశాల భారతదేశంలోని వేరువేరు రాష్ట్రాల ప్రజలు హిందీ భాషలోనే మాట్లాడుకోవాలనడం ఆపాలని సూచించిన కేటీఆర్.. తక్షణమే అమిత్‌షా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.
मित्रों,
गैस हो, डीज़ल हो, पेट्रोल हो – हर प्रकार से महँगाई बढ़ रही है कि नहीं बढ़ रही ? 👇#PetrolDieselPriceHike #BJPLootingIndia pic.twitter.com/S2ycLhQzR8
— Enugu Bharath Reddy (@BharathReddyBRS) April 9, 2022
Unity in diversity is our strength dear @AmitShah Ji. India is a union of states & a true ‘Vasudhaika Kutumbam’
Why don’t we let people of our great nation decide what to eat, what to wear, who to pray to and what language to speak!
Language chauvinism/hegemony will boomerang pic.twitter.com/AwMae3Clra
— KTR (@KTRBRS) April 9, 2022
తాజావార్తలు
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..