రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ లక్ష్యంగా దాడి ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. శనివారం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓవైపు టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి మరింత సానుకూలత తెచ్చుకునేలా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే..…
తెలంగాణలో (Telangana) ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ (TRS) వైఫల్యాలను ఎండగడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణలో బలపడటానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కూడా ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. గ్రామ గ్రామాలు తిరిగి టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులకు అండగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో రేపు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడాలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో.. హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు…
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఈ మధ్య తెలంగాణలో కేఏ పాల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా.. ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ వ్యవహారంపై కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెబుతున్నారు. అమిత్‌షాతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అన్యాయం అక్రమాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.. అమిత్ షాతో అనేక విషయాలను చర్చించాను.. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు, కేసీఆర్…
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అధికారమే లక్ష్యంగా, ప్రజల్లోకి వెళ్లేలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. జనాలతో మమేకం అవుతున్నారు. దీంతో పాటు ప్రజా సంగ్రామ యాత్రకు జాతీయ నాయకులను కూడా రప్పిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్…
పశ్చిమ బెంగాల్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్‌షా కలయిక కారణంగా గంగూలీ బీజేపీలో చేరతారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన ఇంటికి వచ్చిన అమిత్ షాకు గంగూలీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత బీజేపీ నేతల సమక్షంలోనే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత గంగూలీ ఇంట్లోనే ఆయనతో కలిసి అమిత్ షా డిన్నర్…
తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య… మాటలతూటాలు పేలుతున్నాయి. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. గులాబీ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తూ… కేంద్ర ప్రభుత్వం, మోడీకి విజన్ లేదని విమర్శలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా అధికార టీఆర్ఎస్పై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది కమలం పార్టీ. ఈనెల 5న జేపీ నడ్డా, 14న…
ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 9 నెలలే గడిచింది.. ఇప్పుడు ఆయన్ని మార్చేపనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. దీనికి కారణం లేకపోలేదు.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. కింది నుంచి పై స్థాయి వరకు తాము మార్పులు చేయాలనుకుంటే చేసేస్తామని, అందులో ఏమాత్రం సంకోచించడం లేదన్నారు.. గుజరాత్, ఢిల్లీ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆయన కామెంట్లపై ఇప్పుడు కర్ణాటకలో తీవ్రమైన చర్చసాగుతోంది..…
గత వారం బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ, బాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఊహించినట్లుగానే ఈ రెండు స్థానాలలో క్లీన్ స్వీప్ చేసింది. ఇక, బాలీగంజ్‌లో వామపక్షాలు రెండో స్థానంలో నిలవటం విశేషం. మరోవైపు, బీజేపీకి ఈ ఉప ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది. అసన్సోల్ను కోల్పోవడమే గాక ఓట్లు కూడా గణనీయంగా కోల్పోయింది. నిజానికి, 2021 అసెంబ్లీ ఎన్నికల నుంచే బీజేపీలో ఈ క్షీణత…
ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సౌత్ రీజన్ ఆధ్వర్యంలో చెన్నయ్ లో ఘనంగా సమ్మెట్ జరిగింది. దాని నిర్వహణకు తనవంతు సహకారాన్ని సంపూర్ణంగా అందించింది సీనియర్ నటి ఖుష్బూ. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తమిళనాడు సీఎం స్టాలిన్ ను సాదరంగా ఆహ్వానించి, తన తోటి నటీమణులతో కలిసి ఆయనతో ఫోటో కూడా దిగి సోషల్ మీడియాలో ఖుష్బూ పోస్ట్ చేసింది. చిత్రం ఏమంటే… ఆ మధ్య ఖుష్బూ భర్త సుందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన…