ఛత్తీస్గఢ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని 'ఆరోప్ పత్ర' పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ను ఉద్దేశించి రాహుల్ బాబాయ్ గిరిజనులకు ఏం చేశారో చెప్పాలని అమిత్ షా ప్రశ్నించారు.
భారత్ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రారంభానికి కౌంట్డౌన్లు ప్రారంభమవుతున్న వేళ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం మాట్లాడుతూ.. మనం చంద్రుడిని చేరుకున్నామని, త్వరలో సూర్యుని దగ్గరికి చేరుకుంటామని చెప్పారు.
మణిపూర్లో చెలరేగిన హింస ఇప్పటికీ ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు బాక్సింగ్ స్టార్ ఎంసీ మేరీకోమ్ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కారని మంత్రి హరీష్ రావ్ స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే కొన్ని పార్టీలు బూటకపు వాగ్దానాలు చేస్తాయని అన్నారు. కొన్ని పార్టీలు నినాదాలు ఇస్తాయి కానీ నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. చేవెళ్ల సభలో నేను హోంమంత్రి అమిత్ షా కి శాలువా కప్పితే దళితుడిని నిరాకరించారు అని ఆరోపించాడు.
తమకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు.
పశ్చిమ బెంగాల్లోని దుత్తాపుకూర్లో ఆదివారం ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని ఆరోపించారు.