ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ కొనసాగింది. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు.
Sahara Refund Status: సెబీ గత 11 ఏళ్లలో రెండు సహారా కంపెనీల ఇన్వెస్టర్లకు మొత్తం రూ.138.07 కోట్లను తిరిగి ఇచ్చింది. దీంతో పాటు ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించేందుకు సెబీ తెరిచిన ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో రూ.25,000 కోట్లకు పైగా జమ అయ్యాయి.
ఢిల్లీ సర్వీసుల బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్షా రేపు(సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీకి రాష్ట్ర హోదాను ఇవ్వడాన్ని మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూతోపాటు అప్పటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై గురువారం లోక్సభలో చర్చిస్తున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించేలా కేంద్రం తీసుకుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును అధికార పక్షం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది.
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రాసిన 'మెమోరీస్ నెవర్ డై' పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రామేశ్వరంలో ఆవిష్కరించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా రామనాథస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈనెల 29వ తారీఖున ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు.