ఎన్నికలకు మరో మూడు రోజులు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం దూకుడు పెంచారు. ఏకంగా హైకమాండ్ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ.. అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కవరయ్యేలా పర్యటన షెడ్యూల్ ను రూపొందించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ములుగులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడనందుకు క్షమించండి అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ తల్లులు, రామప్ప రుద్రేశ్వరుడు ఆశీర్వాదంతో ఇక్కడ అడుగు పెట్టానన్నారు. ఇదిలా ఉంటే.. ములుగు జిల్లాలో గిరిజన విశ్వద్యాలయంను ప్రధాని మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా.. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపు కొరకు హుడా ట్రక్ పార్క్లో రేపు జరగబోయే విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా వద్దా.. 2024లో మోదీని మరోసారి ప్రధాని కావాలా వద్దా అని అన్నారు. రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుందని ఆరోపించారు. 2019లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన…
MLC Kavitha: అమిత్ షా కాదు అబద్దాల బాద్ షా అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోర్టులో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు.
Amit Shah: ముస్లీం రిజర్వేషన్లు తీసేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఈ పదేళ్ళలో అప్పుల తెలంగాణగా మారిందన్నారు.
నేడు మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు రేపు కూడా రాష్ట్రంలో అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Bulldozers roadshow: రాజస్థాన్ చివరి రోజు ప్రచారం హోరెత్తింది. ఈ నెల 25న రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు జోరుగా ప్రచారం సాగించారు. గురువారం చిత్తోర్గఢ్ జిల్లాలోని నింబహెరా, రాజ్ సమంద్ జిల్లాల్లో నాథ్ద్వారాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలు కూడా జైపూర్లోని వివిధ…
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు మోసం చేశాయి..బీజేపీ ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. breaking news, latest news, telugu news, amit shah, telangana elections 2023