త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. డిసెంబర్ 28న ఆయన రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కేడర్‌కి లోక్‌సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్, భాగ్యలక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేకపూజలు…
లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం మూజువాణి ఓటింగ్ చేపట్టి ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. . పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలపై నిరసనల నేపథ్యంలో 143 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ మధ్య ఈ చట్టాలు ఆమోదించబడ్డాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ..…
New criminal laws: కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లులను ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. ఇకపై మూకదాడికి పాల్పడిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉందని చెప్పారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.
Rahul Gandhi: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై 2018లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 18 ఈ కేసును విచారించిన న్యాయమూర్తి యోగేష్ యాదవ్, వాదనలు విన్న తర్వాత విచారణలు నవంబర్ 27కి వాయిదా వేశారు. అయితే ఈ సమయంలోనే డిసెంబర్ 16న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలని కోరారు.
Rahul Gandhi: బుధవారం రోజు, 2001 పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే కొందరు వ్యక్తులు పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించారు. విజిటర్ల రూపంలో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్లోకి దూసుకెళ్లి, పొగతో కూడిన బాంబుల్ని పేల్చారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ బయట ఇదే తరహా చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది.
Lok Sabha Security Breach: పార్లమెంట్లో ఈరోజు జరిగిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లోకి విజిటర్ల రూపంలో వెళ్లి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్లోకి దూసుకెళ్లారు. పొగతో కూడిన డబ్బాలు పేల్చారు. ఈ ఘటనతో ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. సరిగ్గా డిసెంబర్ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడికి నేటితో 22 ఏళ్లు గడిచాయి. ఇదే రోజున ఇలా ఆగంతకులు దాడికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు…
MP : నేటి నుంచి మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.