Rahul Gandhi: “అమిత్ షాకి చరిత్ర తిరగరాసే అలవాటు ఉంది”.. నెహ్రూ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ వివాదంపై భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఉద్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హోమంత్రికి చరిత్రను తిరగరాసే అలవాటు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘పండిట్ నెహ్రూ దేశం కోసం తన జీవితాన్ని అర్పించారు, ఏళ్ల తరబడి జైలులో ఉన్నారు. అమిత్ షాకు చరిత్ర తెలియదు. ఆయనకు చరిత్ర తెలుస్తుందని నేను ఆశించను. అతనికి దానిని తిరగరాసే అలవాటు ఉంది’’ అంటూ మంగళవారం పార్లమెంట్ వెలుపల మీడియాతో రాహుల్ గాంధీ అన్నారు. కులగణన, నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎవరి చేతుల్లో ఉంది, ఇవన్ని ప్రధాన అంశాలు, వీటిని చర్చించేందుకు బీజేపీ భయపడుతోంది, అందుకే వీటి నుంచి పారిపోతుందని బీజేపీపై రాహుల్ గాంధీ ఆరోపించారు.
Read Also: Renuka Ardhya: ఫ్యామిలీ కోసం భిక్షాటన.. ఇప్పుడు బిలియనీర్.. 1000 కార్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ప్రజలను సమస్యల నుంచి మళ్లించే మార్గమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల పార్లమెంట్‌లో అమిత్ షా మాట్లాడారు. నెహ్రూ మూలంగానే కాశ్మీర్ సమస్య ఏర్పడిందని, ఆయన చేసిన రెండు తప్పులే పీఓకే సమస్యకు కారణమైందని ఆరోపించారు. కాల్పుల విరమణకు భారత్ పిలుపునివ్వకపోతే, కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లకపోతే ఈ రోజు కాశ్మీర్ మొత్తం భారత్‌లో అంతర్భాగంగా ఉండేని షా అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మనీష్ తివారీ ఖండించారు. అప్పటి భారత ఆర్మీ జనరల్ రాయ్ బుచెర్ అప్పటి ప్రభుత్వానికి సలహా ఇచ్చినందున కాల్పుల విరమణ జరిగిందని అన్నారు.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!