Amit Shah: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తప్పకుండా 400కి పైగా స్థానాలను సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
Vasooli Titans: భారత మమిళ క్రికెటర్ పూజా వస్త్రాకర్ ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ, కించపరిచేలా పెట్టిన పోస్టు వైరల్గా మారింది. బీజేపీ నాయకులను హేళన చేస్తూ..‘‘ వసూలీ టైటాన్స్’’ అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ వైరల్గా మారింది. దీనిని ఉపయోగించుకుని కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి.
Raj Thackeray: మహారాష్ట్ర పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేకి చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ ప్లాన్ సిద్ధం చేసింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్, ఉద్ధవ్ ఠాక్రే కజిన్ రాజ్ ఠాక్రేని రంగంలోకి దించింది. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ ఠాక్రేతో భేటీ కావడంతో ఈ బీజేపీతో ఎంఎన్ఎస్ పొత్తు ఖరారైందనే…
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
పీఓకేపై తమ పార్టీ, కేంద్ర ప్రభుత్వం వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్లో భాగమన్నారు. కాబట్టి, అక్కడ హిందువులు, ముస్లింలు ఇద్దరూ మా దేశ ప్రజలేనంటూ పేర్కొన్నారు.
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. టూర్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మర్యాద పూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది.