T20 World Cup 2026: “ఇదంతా నీ వల్లే జరిగింది”.. హార్దిక్ పాండ్యాపై అలిగిన ఇషాన్ కిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ హీట్ పుట్టించనుంది. రేపు శ్రీలంకలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. నిన్న నమీబియాతో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంలో హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించినవాడు. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో రెండింటి లోనూ మెరిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుత ఆరంభం ఇచ్చారు. ఎడమచేతి బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 250కిపైగా ఉంది. ఆ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. మొదటి భాగం ముగిసే సరికి మ్యాచ్ మొత్తం కిషన్ చుట్టూనే తిరుగుతున్నట్టే అనిపించింది. కానీ హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లో 52 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. అతని దూకుడు ఆటతో భారత్ స్కోరు వేగంగా పెరిగింది. ఇద్దరి అర్ధశతకాలతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది.
READ MORE: MS Dhoni: పాక్ మిస్టరీ స్పిన్నర్ తారిక్ ఎదుగుదలలో ఎంఎస్ ధోని కీలక పాత్ర..
Also Read
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
అయితే అసలు మలుపు బౌలింగ్‌లో వచ్చింది. హార్దిక్ తన నాలుగు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అతని బౌలింగ్‌తో నమీబియా జట్టు ఒత్తిడిలో పడింది. మొదట్లో వారు బాగా ఆడుతున్నట్టే కనిపించారు. కానీ మధ్యలో వికెట్లు వరుసగా పడిపోవడంతో మ్యాచ్ చేతుల నుంచి జారిపోయింది. చివరకు నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, బౌలింగ్‌లోనూ ప్రభావం చూపిన హార్దిక్ మ్యాచ్‌ను పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడు. అందుకే అతనికి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. ఈ అవార్డు విషయంలో ఇషాన్ కిషన్, హార్దిక్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఇషాన్ కిషన్, హార్దిక్ ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. “నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు నా మాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకెళ్లావ్” అంటూ కిషన్ సరదాగా అన్నాడు. ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు. హార్దిక్ అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి బలంగా నిలబడటానికి ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని కిషన్ చెప్పాడు. “ఎవరైనా గురించి నెగటివ్‌గా మాట్లాడటం మన పని కాదు. మన చేతిలో ఉన్నదే చేయాలి. అది మంచి ఆట ఆడటం” అని హార్దిక్ తనకు చెప్పేవాడని కిషన్ వెల్లడించాడు. తాను కూడా అదే మార్గంలో నడిచానని, ఆ కృషికి హార్దిక్‌కి సైతం క్రెడిట్ ఇవ్వాలని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఇదంతా హార్దిక్ వల్లే జరిగింది” అంటూ నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE: Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ ఎన్నికల్లో సంచలనం.. నాలుగురు హిందూ అభ్యర్థులు ఘన విజయం..
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!