Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దు’’ అని కాంగ్రెస్‌ని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం బీజేపీ కార్యకర్తలు, ప్రధాని మోడీ నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాలేదని, ఒక వేళ యాదృచ్చికంగా అదే జరిగితే ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దని, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, మీ బుజ్జగింపు రాజకీయాలు ముగిశాయని అమిత్ షా అన్నారు.
Read Also: Alcohol: మద్యం తాగొద్దని సలహా ఇవ్వడమే నేరమైంది.. వ్యక్తి దారుణహత్య..
మధ్యప్రదేశ్ మాండ్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడిని షా.. దేశంలో గిరిజనుల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. గత 10 ఏళ్లలో ముఖ్యంగా గిరిజనుల కోసం ప్రధాని మోడీ తీసుకువచ్చిన కేంద్ర పథకాలను హైలెట్ చేశారు. గిరిజనుల ఆధార్య దైవం బిర్సాముండా పుట్టిన రోజున ‘జన్‌జాతీయ గౌరవ్ దివాస్’గా జరుపుకోవాలనేది ప్రధాని మోడీ ఆలోచన అన్నారు. మొదటి జనజాతీయ గౌరవ్ దివాస్‌ని మధ్యప్రదేశ్ (నవంబర్ 15, 2021న) జరుపుకున్నారని, గిరిజనుల కోసం పెసా చట్టాన్ని బీజేపీ అమలు చేసిందని అమిత్ షా చెప్పారు.