రవాణా వ్యవస్థలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు పెను మార్పులు తీసుకొచ్చాయి. ఆన్ లైన్ లో బుక్ చేస్తే చాలు నిమిషాల్లో వెహికల్ ఇంటి ముందుకు వచ్చేస్తోంది. ఇదే సమయంలో టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఆయా సంస్థలు కమిషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తాము నష్టపోతున్నామని ఓలా, ఉబర్ వంటి సర్వీసులతో వాహనాలు నడిపే డ్రైవర్లు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది. నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘సహాకార్ ట్యాక్సీ’ పేరుతో కొత్త ట్యాక్సీ సర్వీసును ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read:CM Revanth Reddy : మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా.. నీళ్లు ఇస్తం.. తొందర్లోనే జైలుకు వెళ్తారు
ఇది ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడుతుందని చెబుతున్నారు. ఈ సేవ కింద, ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి బైక్‌లు, క్యాబ్‌లు, ఆటోలను బుక్ చేసుకోవచ్చని సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ‘సహకార్ ట్యాక్సీ’ని ప్రకటించారు. పెద్ద కంపెనీలకు లాభాలు ఇవ్వకుండా డ్రైవర్లు నేరుగా సంపాదించడంలో సహాయపడటమే దీని లక్ష్యమని ఆయన అన్నారు. రైడ్ నుండి వచ్చిన లాభం నేరుగా డ్రైవర్‌కు వెళ్తుందని చెబుతున్నారు.
Also Read:Malla Reddy : అసెంబ్లీలో మల్లారెడ్డి మసాలా.. స్పీకర్‌ను షాక్ ఇచ్చిన కామెడీ పంచ్..!
ట్యాక్సీ డ్రైవర్ ఎక్కడా ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ట్యాక్సీ డ్రైవర్లకు లాభాల పంట పండనున్నది. త్వరలోనే దేశవ్యాప్తంగా సహకార్ ట్యాక్సీలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ సేవలో చేరడానికి టూవీలర్స్, క్యాబులు సహకార్ ట్యాక్సీలో నమోదు చేయబడతాయని చెబుతున్నారు. సహకార్ ట్యాక్సీ ప్రధాన లక్ష్యం ప్రజలకు చౌక రవాణా సేవలను అందించడం. ఇది డ్రైవర్లకు డబ్బు సంపాదించడానికి ప్రయోజనకరంగా ఉండనున్నది.