దండకారణ్యంలో ఏం జరుగుతుంది.. దండకారణ్యం మొత్తాన్ని కూడా భద్రతా బలగాలు ఖాళీ చేయిస్తున్నాయా.. మావోయిస్టుల పట్టు బిగిస్తున్నారా లేక సడలిస్తున్నారా అర్థం కాని పరిస్థితి.. దండకారణ్యం మొత్తం కూడా ఇప్పుడు భద్రత బలగాల చేతుల్లోకి వెళ్ళిపోతుందా? దండకారణ్యం భూభాగంలోకి అడుగుపెట్టడానికే జంకిన బలగాలు ..ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాయా… దండకారణ్యంలో ఎందుకు మావోయిస్టు పట్టు కోల్పోతున్నారు.. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది ..ఏడాది కాలంలో మావోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోయారా? ఏడాది కాలంలో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బలు తగిలాయి..
Also Read:SRH vs DC: 5 వికెట్లతో మెరిసిన మిచెల్ స్టార్క్.. 163 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్ ఆలౌట్
ఎక్కడ ఎప్పుడు ఎన్కౌంటర్ దిగిన పదుల సంఖ్యలో మావోలు మృతి చెందుతున్నారూ.. చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో భారీ ఎత్తున మావోయిస్టు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ సంవత్సరం జూలై నాటికి మావోయిస్టులను దండకారణ్యం నుంచి కాళీ చేయిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ..ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యిందా.. అసలు ఆపరేషన్ కగార్ ఏం చేస్తుంది? మావోయిస్టులను కగార్ ..కంగారు పెట్టేస్తుందా ఇలాంటి ప్రశ్నలకు జవాబులు లేవు కానీ మావోయిస్టు మాత్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు..
Also Read:Seethakka: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో బండి సంజయ్ చెప్పాలి..
మావోయిస్టులకు అత్యంత పట్టు ఉన్న ప్రాంతం దండకారణ్యం.. ఈ ప్రాంతంలోకి పోలీసులు భద్రత బలగాలు వెళ్లాలంటే చాలా యాతన పడాల్సి వచ్చేది.. చివరికి దండకారణ్యం కొంత భాగం ఉన్న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో పోలీసులు ఆమెరకు సక్సెస్ అయ్యారు.. దండకారణ్య అడుగు భాగంలో ఉన్న ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మావోయిస్టును పూర్తిస్థాయిలో ఏరి వేశారు.. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టును తరిమి వేశారు.. మళ్ళీ ఈ ప్రాంతంలోకి రాకుండా అక్కడ విపరీతమైన అభివృద్ధి పనులు చేసి పెట్టారు. అయితే ఇప్పుడు చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ సుకుమా ఒడిస్సా లోని రాయపూర్ కి అతి సమీపంలో మావోయిస్టు క్యాంపులు విపరీతంగా ఉన్నాయి.
Also Read:Chhattisgarh: మోడీ టూర్‌కు ముందు కీలక పరిణామం.. 50 మంది మావోలు లొంగుబాటు
అయితే ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టును ఏడాది జూలై లోపు పూర్తిస్థాయిలో ఏరివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది.. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కృత నిశ్చయంతో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి ..ఒకప్పుడు మావోయిస్టులకు అత్యంత పట్టున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు భద్రతాబలగాలు పాగా వేశాయి.. మావోయిస్టులు ఎటు వెళ్లడానికి ప్రయత్నం చేసిన కూడా భద్రత బలగాలకు చిక్కిపోతున్నారు.. అటవీ ప్రాంతం నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి.. ఈ ఎదురుకాల్పులో మావోయిస్టులు ప్రత్యేక పరిస్థితులను ఎదురుకోవాల్సి వస్తుంది.
Also Read:SRH Ugadi Wishes: తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌ఆర్‌హెచ్ టీం.. వీడియో వైరల్
గత సంవత్సరకాలంలో ఎక్కడ ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగిన అక్కడ పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు.. కనీసం 10 నుంచి 30 మంది మావోయిస్టులు భద్రతా బలగాల చేతుల్లో మృత్యువాత పడుతున్నారు. ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 90 రోజుల్లో 100 మంది మావోయిస్టులు చనిపోయారు.. ఇది చరిత్రలో ఎప్పుడు జరగని కనీ, విని రీతిలో ఎన్కౌంటర్లో మావోయిస్టులకు ప్రాణ నష్టం జరిగింది.. ఇంతటి భారీ నష్టాన్ని మావోయిస్టులు ఎప్పుడు కూడా చూడలేదు. అయితే మావోయిస్టు మరోవైపు మావోయిస్టులనేతలు కూడా మృత్యువాత పడుతున్నారు ఈ మూడు నెలల కాలంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలను కోల్పోవలసి వచ్చింది.
Also Read:Seethakka: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో బండి సంజయ్ చెప్పాలి..
దీనికి తోడు ఇటీవల కాలంలో పార్టీలో చేరిన చాలామంది కార్యకర్తలు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు.. మావోయిస్టులు ఎందుకు భద్రతా బలగాలకు చిక్కిపోతున్నారు. అసలు దీని వెనకాల ఉన్న కారణాలేంటి? మావోయిస్టులో కోవర్ట్ ఆపరేషన్ కొంపముచ్చుతుందా.. లేకుంటే మావోయిస్టు విపరీతంగా వాడుతున్న టెక్నాలజీ వాళ్ళ పాలిట శత్రువు అయిందా అనేది ఇప్పుడు సమీక్షించుకుంటున్నారు.. మరోవైపు మావోయిస్టు దండకారణ్యం ప్రాంతాన్ని వదిలిపెట్టి ఈశాన్య రాష్ట్రాల వైపు ప్రయాణం అవుతున్న నేపథంలోనే భద్రతా బలగాలకు చిక్కుతున్నారని ఒక వాదన కొనసాగుతుంది.. ఇలాంటి ప్రయత్నమే కనుక మావోయిస్టు చేస్తున్నారంటే మూకుమ్మడిగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూకుమ్మడిగా తరలి వెళ్లే అవకాశం లేదు.
Also Read:Yashwanth Varma: మిస్టరీగా 3 ఫోన్ కాల్స్.. ఛేదిస్తున్న ఢిల్లీ పోలీసులు
ఎందుకంటే చిన్న చిన్న జట్లుగా విడిపోయి వాళ్లు తమ గమ్య స్థానానికి చేరుకుంటారు ..కానీ ఒకేసారి వందల మంది ఇలా భద్రత బలగాలకు చిక్కిపోయి ఎన్కౌంటర్లు జరుగుతుంటే అందులో పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది కాబట్టి అసలు మావోయిస్టుల భద్రతా బలగాలకు ఎలా చిక్కుతున్నారు అనే దానిమీద ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీ కొనసాగుతుంది. నక్సలైట్ల నుంచి మావోయిస్టుగా రూపాంతరం చెందింది తర్వాత కూడా ఇంతటి నష్టాన్ని ఎప్పుడు మావోయిస్టులు ఎదుర్కోలేదు.. ఏది ఏమైనప్పటికీ కూడా మావోయిస్టుల ఏరివేత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అవుతుందని తన వాదన చెప్తుంది.