Hurricane Beryl: టెక్సాస్ లో బెరిల్ తుఫాన్ బీభత్సం.. ముగ్గురు మృతి..!
- టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుఫాన్ బీభత్సం..
- ఈ తుఫాన్ వల్ల అంధకారంలో 2. 7 మిలియన్ ప్రజలు..
- ఇప్పటికే 1300 విమానాలు రద్దు చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hurricane Beryl: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా బలమైన గాలులు, కుండపోత వర్షం కురుస్తుండటంతో సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు మరణించారు. అలాగే, కరెంట్ కు తీవ్ర అంతరాయం కొనసాగుతుండటంతో 2.7 మిలియన్లకు పైగా ప్రజలు అంధకారంలో ఉన్నారు. వరద నీటి తాకిడితో రహదారులు పూర్తిగా దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు, 1,300కు పైగా విమాన సర్వీసులను అధికారులు క్యాన్సిల్ చేశారు. ఇక, గత వారం బెరిల్ హరికేన్ ధాటికి జమైకా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ లో కూడా విధ్వంసం సృష్టించింది. అలాగే, టెక్సాస్‌కు సమీపంలోని మెక్సికో, కరేబియన్‌లలో సుమారు 11 మంది మృత్యువాత పడ్డారు అని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ వెల్లడించారు.
Read Also: US React PM Modi Russia Tour: భారత ప్రధాని రష్యా పర్యటనపై అమెరికా రియాక్షన్ ఇదే..!
Also Read
ఇక, తుఫాన్ వల్ల హ్యూస్టన్ ప్రాంతంలో ఇళ్లపై చెట్లు కూలిన ఘటనలో మరో ఇద్దరు మరణించారు. ఇక విద్యుత్ ప్రసారాన్ని పునరుద్ధరించడానికి చాలా రోజుల సమయం పడుతుందని టెక్సాస్ పబ్లిక్ యుటిలిటీ కమిషన్ చైర్ థామస్ గ్లీసన్ పేర్కొన్నారు. టెక్సాస్ డివిజన్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ చీఫ్ నిమ్ కిడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 2,500 మంది ఫస్ట్ రెస్పాండర్‌లను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కోసం రంగంలోకి దిగినట్లు తెలిపారు. అలాగే, సోమవారం తెల్లవారుజామున గాల్వెస్టన్, సార్జెంట్, లేక్ జాక్సన్, ఫ్రీపోర్ట్ లాంటి నగరాల్లో ఈదురుగాలులు, కుండపోత వర్షం కురిసినట్లు వెదర్ డిపార్ట్మెంట్ చెప్పుకొచ్చింది. భారీగా పోటెత్తిన వరదల వల్ల రహదారులు మొత్తం మునిగిపోయినట్లు చెప్పారు. హ్యూస్టన్‌లోని చాలా ప్రాంతాలలో వరద నీరు 10 అంగుళాలు (25 సెం.మీ.) మించి ప్రవహిస్తుందని మేయర్ జాన్ విట్‌మైర్ చెప్పుకొచ్చారు. ప్రజలందరు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!