అమెరికాకు మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగింది. కానీ ఈసారి మాత్రం రష్యా ఎన్నికల ముందు అగ్రరాజ్యం అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఎర్ర సముద్రంలో కార్గో షిప్‌లను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీ రెబల్స్ పై అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ భారీ ఎత్తున దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మరణించారు. అలాగే, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆ యువకుడు అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఆ యువకుడిని కబలించివేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వైట్ హౌస్ రేసులో సూపర్ మంగళవారం అతిపెద్ద రోజు. అధ్యక్ష ప్రాథమిక క్యాలెండర్లో అత్యధిక రాష్ట్రాలు ఓటు వేసే రోజు. మార్చి 5న, 16 యూఎస్ రాష్ట్రాలు, ఒక భూభాగంలోని ఓటర్లు అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేశారు. ప్రెసిడెంట్ జో బైడెన్, అతని ముందున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ నవంబర్ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగుతున్నారు.
ప్రపంచంలో ఉండే మనుషులు వింత వింత రకాల అలర్జీలతో బాధపడుతున్నారు. కొంతమందికి దుమ్ము అలర్జీ, స్మెల్ అలర్జీ.. ఇలా రకరకాల అలర్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నీటి అలర్జీతో బాధపడటం మీరెప్పుడైనా విన్నారా.. ?. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన ఓ యువతి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ యువతి తలస్నానం చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెబుతోంది. భరించలేని నొప్పితో పాటు శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయని తెలుపుతుంది.
అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. కాలిఫోర్నియాలో (California) పబ్లిక్‌గా (Outdor party) జరుపుకుంటున్న వేడుకపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.