ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా గుంపులు.. గుంపులుగా మిడతల దండు బీభత్సం సృష్టించాయి. సేదదీరేందుకు బీచ్‌కు పోతే.. హఠాత్తుగా డ్రాగన్‌ఫ్లై సమూహం ఎటాక్ చేయడంతో పర్యాటకులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: BJP: రాహుల్ గాంధీని కులం అడిగితే తప్పేంటి..? ఆయన అదే పనిచేస్తున్నారు కదా..
అది అమెరికాలోని మిస్‌క్వామికట్ స్టేట్ బీచ్. వందలాది మంది బీచ్‌కి వచ్చి ఉల్లాసంగా గడుపుతున్నారు. తమ వారితో కలిసి ఆహ్లాదకరంగా విహరిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి మిడతల దండు దూసుకొచ్చింది. ఈ హఠాత్తు పరిణామంతో షాక్‌కు గురయ్యారు. కొందరైతే అక్కడ నుంచి కేకలు వేస్తూ పరారయ్యారు. ఇంకొందరు అక్కడే అలా చూస్తూ ఉండిపోయారు. ఈ సందర్భంగా బైబిల్‌లో ఐగుప్తు దేశంలో మోషే కాలంలో జరిగిన సంఘటనను గుర్తుకుతెచ్చుకున్నారు. ఐగుప్తుపైకి మిడతల దండు వచ్చినట్లుగా ఇక్కడ కూడా వచ్చిందని జ్ఞాపకం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మేఘం చీకటిగా కమ్ముకున్నప్పుడు ఒక్కసారిగా మిడతల దండు వచ్చిందని రాసుకొచ్చారు. సముద్రం నుంచి అవి వచ్చాయని.. ఎడవవైపు నుంచి అవి దూసుకొచ్చాయని పేర్కొన్నారు. ఒకేసారి ఇన్ని తూనీగలు దూసుకురావడం ఆశ్చర్యం కలిగించిందని ఇంకొకరు చెప్పుకొచ్చారు. ఆ మిడతల దండు వీడియో మీరు కూడా చూసేయండి.
More video of Dragon Flies taking over Misquamicut State Beach in Rhode Island #bikiniseason pic.twitter.com/63L61gYt4t
— Alias (@aliascontent) July 28, 2024
https://twitter.com/TheLatePress/status/1817762241401557448