Iran-Israel : ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనూహ్య మలుపు తిరగటానికి సిద్ధంగా ఉంది. ఒకటి రెండు రోజుల్లో అమెరికా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఎంటరైతే.. జరగబోయే పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకూ సిచ్యువేషన్ రూమ్ లో వ్యూహం ఖరారైందా..? అమెరికా ముందున్న ఆప్షన్లేంటి..? ఇరాన్ లో ఏం చేస్తే అమెరికాకు లాభం..? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆ రెండు దేశాల పరిధి దాటిపోయింది. ఇప్పుడు యుద్ధం కొనసాగింపు, ముగింపుపై అమెరికాదే తుది నిర్ణయం…
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మరిన్ని దేశాలకు పాకే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండగా.. ఇప్పుడు మూడో దేశం అమెరికా కూడా తోడవుతోంది. ఇరాన్‌పై యుద్ధానికి రంగంలోకి దిగుతోంది.
‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్? గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ టైటిల్ ప్రకటనతో పాటు విడుదలైన రెండు ఫస్ట్‌లుక్ పోస్టర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. జాతీయ అవార్డు గ్రహీత, “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, విజనరీ నిర్మాత వెంకట…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఇరు పక్షాలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరుగుతోంది. అణు ఉత్పత్తిని నిలిపివేసేంత వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో అమెరికాలో పర్యటిస్తున్నారు. అసిమ్ మునీర్ రెచ్చగొట్టడంతోనే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
చాలా మంది అమెరికాలో చదువుకోవాలని.. అక్కడ స్థిరపడాలని కలలు కంటారు. కానీ పరిస్థితులు.. ఒకప్పటిలాగా లేవు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసలపై కఠినమైన ఆంక్షలు పెట్టారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. టెహ్రాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అమెరికా కూడా వార్నింగ్‌లు ఇస్తోంది. అణు ఒప్పందం చేసుకుంటారా, లేదా.. ఖబర్దార్ అంటూ టెహ్రాన్‌ను హెచ్చరిస్తోంది. మరో యుద్ధం ముంచుకొస్తోంది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏళ్లుగా సాగుతున్న సమరం.. గాజాలో కొనసాగుతున్న అలజడి.. వీటికితోడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి.. ఇతర దేశాలు ఎంటరైతే! ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోయి.. సమరశంఖం పూరిస్తాయా ? మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా ? ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు..…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ భీకర దాడులు చేసింది. 24 గంటల వ్యవధిలోనే మరోసారి శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.