India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు.. యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
- పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు
- యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తిప్పికొట్టింది. భారత్ దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ.. అణు బ్లాక్ మెయిల్ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు. భారతదేశం ఎలాంటి బెదిరింపులకు భయపడదని.. ఎప్పుడూ తలొగ్గదని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారతదేశం సందేశం స్పష్టంగా ఉందని.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించాలని కోరింది. ఇక భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Meenakshi-Chowdary : టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు అడుగు.. మీనాక్షి చౌదరి కొత్త ప్రయాణం
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్‌పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
భారతదేశంతో పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నట్లు షెహబాజ్ షరీఫ్ ప్రసంగాలు చేయడం కాదు.. మాటల్లో నిజంగా నిజాయితీ ఉంటే ఆచరణలో చూపించాలని హితవు పలికారు. అలాగైతే వెంటనే పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలను తక్షణమే మూసివేతకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భారతదేశం అడుగుతున్న ఉగ్రవాదులను తక్షణమే అప్పగించాలని కోరారు. ద్వేషం, మతతత్వం, అసహనాన్ని అనుసరించే దేశం.. యూఎన్ సభలో విశ్వాస విషయాలపై బోధించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ అద్దం వైపు చూడడం చాలా కాలం అయి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇది కూడా చదవండి: Off The Record : బాలకృష్ణ కామెంట్స్ పై మెగా బ్రదర్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్.. భారత్‌పై విజయం సాధించినట్లు చెప్పుకోవడం అబద్ధం అని తేల్చారు. భారతదేశమే పాకిస్థాన్ వైమానిక స్థావరాలను, ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా చూపించామని చెప్పారు. అంతేకాకుండా ఇటీవల ఆ ఉగ్ర సంస్థలు కూడా నిర్ధారించాయని పేర్కొన్నారు. భారతదేశంలో అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపడానికి పాకిస్థాన్ ప్రోత్సాహంతోనే జరిగిందని స్పష్టం చేశారు. మా ప్రజల హక్కుల కోసం మేము మా హక్కును వినియోగించుకున్నట్లు తేల్చిచెప్పారు.
యూఎన్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో భారత్‌పై పాకిస్థానే విజయం సాధించిందని.. హిందుత్వం ప్రపంచానికి ప్రమాదమని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రంప్ సూచన మేరకే భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని చెప్పారు. ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అని షరీఫ్ ప్రశంసించారు.
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif's speech, First Secretary in India's Permanent Mission to the UN, Petal Gahlot says, "Where terrorism is concerned, we are making it clear that there will be no distinction between the… pic.twitter.com/ntcHcYab4m
— ANI (@ANI) September 27, 2025
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif's speech, First Secretary in India's Permanent Mission to the UN, Petal Gahlot says, "Mr President, India and Pakistan have long agreed that any outstanding issue between them will be… pic.twitter.com/jLpx5uxhYB
— ANI (@ANI) September 27, 2025
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif's speech, First Secretary in India's Permanent Mission to the UN, Petal Gahlot says, "The Pakistani Prime Minister has spoken about wanting peace with India. If he is indeed sincere, the… pic.twitter.com/y0tTyA3EgE
— ANI (@ANI) September 27, 2025
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif's speech, First Secretary in India's Permanent Mission to the UN, Petal Gahlot says, "The intervening event was the destruction caused to multiple Pakistani air bases by Indian forces. The… pic.twitter.com/VBIIXLhzyd
— ANI (@ANI) September 27, 2025
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif's speech, First Secretary in India's Permanent Mission to the UN, Petal Gahlot says, "A picture speaks a thousand words and we saw many pictures of terrorists slain in Bahawalpur and Muridke… pic.twitter.com/suujcgKvGI
— ANI (@ANI) September 27, 2025
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif's speech, Indian diplomat Petal Gahlot says, "Mr President, this assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism… pic.twitter.com/ALR2AnDoA9
— ANI (@ANI) September 27, 2025
తాజావార్తలు
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!