Zelenskyy: రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండించాలి.. యూఎన్‌లో జెలెన్‌స్కీ పిలుపు
- రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండించాలి
- యూఎన్‌లో జెలెన్‌స్కీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత మానవ చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశంలో జెలెన్‌స్కీ ప్రసంగించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని.. ఈ తీరు మారాలని కోరారు. యుద్ధం ముగింపునకు ప్రపంచ దేశాలు సహకరించాలని కోరారు. శాంతికి సహకరిస్తారా? లేదంటే రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తారో మీరే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రజల ఆదాయం పెంచుతున్నాం.. జీఎస్టీ సంస్కరణలు నిరంతర ప్రక్రియ
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
తమపై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోందని.. ఈ తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ యుద్ధం మరింత విస్తరిస్తోందని పేర్కొన్నారు. యూరప్ అంతటా రష్యా డ్రోన్లు ఎగురుతున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని వాపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని ఆపలేకపోయారని చెప్పుకొచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
2022, ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఏకధాటితో యుద్ధం సాగుతూనే ఉంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగారు. అలాస్కా వేదికగా పుతిన్‌తో సమావేశం అయ్యారు. అయినా కూడా యుద్ధం ఆగలేదు. పుతిన్ పెట్టే షరతులు కారణంగా శాంతి ఒప్పందం ముందుకు సాగడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య నిత్యం బాంబు దాడులు జరుగుతూనే ఉంటున్నాయి.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!