అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న ఆయన మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Former Minister Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం..
రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్షుడిగా రెండు సార్లు కంటే ఎక్కువగా పోటీ చేయడానికి వీలుండదు. కానీ ఈ మధ్య ట్రంప్ మాత్రం మూడోసారి పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇందుకోసం రాజ్యాంగంలో లొసుగులు ఉన్నాయంటూ ట్రంప్ మద్దతుదారులు చెప్పుకొస్తున్నారు. వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ట్రంప్ మూడోసారి పోటీ చేయాలని సూచించారు. మూడోసారి పోటీ చేయడానికి ప్రణాళిక ఉందని చెప్పుకొచ్చారు. తాజాగా ఇదే అంశంపై మలేషియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ.. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ అందుకు ప్రజలు ఇష్టపడరని.. సరైంది కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాని గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Raj Tharun : రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ ట్రైలర్ రిలీజ్
తన తర్వాత రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వారసులు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్న విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వైపు వేలు చూపించారు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు ఉన్నారని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు. మార్కో రూబియో, జేడీ వాన్స్‌లు గొప్ప వ్యక్తులంటూ కొనియాడారు. వారిలో ఒకరు పక్కనే నిలబడి ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ట్రంప్ ప్రశంసించారు. జేడీ వాన్స్ గొప్పవాడు అంటూ కొనియాడారు. ఈ ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారో లేదో తనకు ఖచ్చితంగా తెలియదు అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇక మలేషియా పర్యటన ముగించుకుని టోక్యోకు వెళ్తుండగా ట్రంప్ తన సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. ‘‘మలేషియా శక్తివంతమైన దేశం. వాణిజ్యం, అరుదైన భూమి ఒప్పందాలపై సంతకాలు చేశాం. ముఖ్యంగా థాయ్‌లాండ్-కంబోడియా మధ్య శాంతి ఒప్పందంపై సంతకం చేశాను. యుద్ధం లేదు.! లక్షలాది మంది ప్రాణాలును కాపాడాను. దీన్ని పూర్తి చేయడం చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు జపాన్‌కు వెళ్తున్నా.’’ అంటూ ట్రంప్ రాసుకొచ్చారు.
President Trump responds to Steve Bannon calling for him to run for a third presidential term in 2028:
"I have the best poll numbers I've ever had. I mean, I just solved 8 wars and a 9th is coming."pic.twitter.com/qXwg91uWAx
— The American Conservative (@amconmag) October 27, 2025