Massive System Failure in America: అగ్రరాజ్యమైన అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సిస్టమ్‌లో భారీ సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయని బుధవారం వార్తా నివేదికలు వెల్లడించాయి. సాంకేతిక లోపం కారణంగా యునైటెడ్ స్టేట్స్ అంతటా విమానాలు ప్రభావితమయ్యాయని తెలిపాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్ అవేర్ యూఎస్’ ప్రకారం ఉదయం 5:31 గంటలకు యునైటెడ్ స్టేట్స్‌లో 400 విమానాలు ఆలస్యమైనట్లు నివేదించింది. ఎక్కడి విమానాలు అక్కడే ఉండడంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సాంకేతిక లోపం కారణంగా యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేసింది.
Saudi Crown Prince: సౌదీ ప్రిన్స్ కీలక నిర్ణయం.. పాకిస్థాన్‌లో పెట్టుబడులను పెంచే దిశగా..
ఎఫ్‌ఏఏ తన వెబ్‌సైట్‌లో నోటీస్ టు ఎయిర్ మిషన్స్(నోటామ్) వ్యవస్థ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం విఫలమైందని తెలిపింది. యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వ్యవస్థ ప్రమాదాల గురించి పైలట్లు, ఇతర విమాన సిబ్బందిని హెచ్చరిస్తుంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్‌లో సమస్యను ఎదుర్కొంటున్నందున యునైటెడ్ స్టేట్స్ అంతటా అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయని వెబ్‌సైట్ పేర్కొంది. ఇప్పుడు తన నోటీస్ టు ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు ఎఫ్‌ఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ గగనతల వ్యవస్థ అంతటా కార్యకలాపాలు ప్రభావితమవుతాయని పేర్కొంది. ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే సరైనా సమయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం.
United States FAA working to restore its Notice to Air Missions System. We are performing final validation checks and reloading the system now. Operations across the National Airspace System are affected: US Federal Aviation Administration https://t.co/64HW0c2bgC pic.twitter.com/3gNMNpBSPy
— ANI (@ANI) January 11, 2023