సంగా రెడ్డిలో రెండు ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, త్వరలో మరొక 13 అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… తల్లితండ్రులు జ్ఞాపకార్థము పేద ప్రజలకోసం రెండు ఉచిత అంబులెన్సులను ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మరో 13 అంబులెన్స్ లు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రాజకీయం కోసం కాదు చాలా రోజుల నుండి తల్లితండ్రుల పేరు మీద సర్వీస్ చేయాలని ఆలోచనతో చేస్తున్నాను. పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పడొద్దని ఈ ఉచిత అంబులెన్స్ సర్వీస్ లు ప్రారంభిస్తున్న అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు తమ అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అంబులెన్సు లకు ఒక్కరూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని తెలిపారు.