చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుడమేరు, కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరమని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్ను 3 బోట్లు ఢీకొన్న ఘటనకు వైసీపీ కుట్ర కారణమని చంద్రబాబు అపవాదు వేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఈ రోజు కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
అచ్యుతాపురం ఘటన బాధాకరం అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. కానీ, ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా నెపం మాపై నెట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరం అన్నారు.
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్పై నెట్టేసి తప్పుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో.. తుంగభద్ర నుంచి 90,000 క్యూసెక్కుల నీరు బయటకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల కొన్ని జిల్లాలకు వరద ముంపు ఏర్పడిందన్నారు.
విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి, శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దుండగులు చేసిన దాడి ఘటనను, రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ దాడిని నిరసిస్తూ.. వైసీపీ శ్రేణులు గుంటూరు శంకర్ విలాస్ నుండి లాడ్జి సెంటర్ వరకు క్యాండిల్ నిరసన ర్యాలీ చేశారు.
Ambati Rambabu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్ లు మొదలు పెట్టారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు.. చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు.
గడిచిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ నిజం చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారంట అంటూ ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాలంట... లేకపోతే కేసులు పెడతారంట ...హోం మంత్రికి ఆ పవర్ ఉంటే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు.
ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని ఆయన కొనియాడారు.
వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కింది… జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీది నుండి పొయ్యలో పడ్డట్టయిందని ఆయన అన్నారు. నిజాం రాజ్యం లాగా బిఆర్ఎస్ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని,…