ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
ఎన్నికల కమిషన్ విచారించి నిర్ణయం తీసుకోవాలి.. చంద్రబాబు మోసగాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా చెత్తబుట్టలో వేశాడు.. జగన్ మొనగాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాడు.. మోసగాడు కావాలో మొనగాడు కావాలో ప్రజలే నిర్ణయిస్తారంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో తన రెండో అల్లుడు, డాక్టర్ గౌతమ్ తన మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ చేశాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ములుగు జిల్లాలో విషాదం.. నదిలో మునిగి బాలిక మృతి ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండలు తాళలేక తండ్రి, కూతురు గోదావరి స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా తండ్రి నదిలో మునిగిపో సాగాడు. దీంతో భయాందోళన చెందిన కుమార్తె నిఖిత (14) సాయం చేసేందుకు.. తన తండ్రికి చెయ్యి అందించబోయింది. అంతే ప్రమాదశాత్తు గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు వదిలింది. తండ్రి రాజేందర్ మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. మంగపేట (మం) కమలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.…
రాష్ట్రంలో సానుభూతి కోసం పాకూలాడేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు అని తెలిపారు. మాకు సానుభూతి అవసరం లేదు.. ఎందుకంటే మా నాయకుడు ( జగన్ ) ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారు.. ఆ ధీమాతోనే మేమే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నాం.
Andhra Pradesh, Ntv Exclusive Super Hit Political Talk Show Live, questionhour With Ambati Rambabu, YSRCP, Ambati Rambabu, CM YS Jagan , Questionhour With Ambati Rambabu Live
ప్రజాబలం ఉన్న జగన్ పై ఎందుకు కక్ష కట్టారని, జగన్ పై అఘాయిత్యం చేయడానికి కుట్రాపన్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ మరణం తర్వాత, జగన్ ప్రజల కష్టాలు తీర్చడానికి ముఖ్యమంత్రి అయ్యాడని, ఎన్నికల కు ముందు, జగన్ ను గద్దె దించడానికి ముందు కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు. మూడు పార్టీ లు కలసి వచ్చిన ఓడించ లేం అని భావించి ,ఇప్పుడు జగన్ పై మరో కుట్ర…
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లాలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అంబటి తెలిపారు. ప్రతి పేదవాడి గుండెను తట్టి చూసినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అంటున్నారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పనిచేశారని కొనియాడారు. ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మాటలు ప్రజలు నమ్మరు... నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో…