అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఐదు వారాలు పూర్తి కాకముందే, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే, ఇక్కడో ఫిట్టింగ్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే, రూ. 200 కట్టాల్సి ఉంటుంది. రెంటల్స్ విధానంలో ఈ చిత్రాన్ని అమెజాన్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా.. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సినిమాలు చూసేందుకు వీలుంటుంది. అయితే.. ఎర్లీ యాక్సెస్‌లో భాగంగా ముందుగానే స్ట్రీమ్ చేస్తుండడంతో, రెంటల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంకా…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కొత్త సినిమా ‘నీయత్’ షూటింగ్ మంగళవారం యూకేలో మొదలైంది. విద్యాబాలన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘శకుంతలదేవి’ చిత్రాన్ని తెరకెక్కించిన అనూ మీనన్ ‘నీయత్’ సినిమాను డైరెక్ట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్, అబాండెంటియా ఎంటర్ టైన్ మెంట్, విద్యాబాలన్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. గతంలో ఈ ముగ్గురి కలయికలో ‘శకుంతల దేవి, షేర్నీ, జల్సా’ చిత్రాలు వచ్చాయి. లేటెస్ట్ మూవీ ‘నీయత్’లో విద్యాబాలన్ డిటెక్టివ్ మీరా రావ్ పాత్రను పోషిస్తోంది.…
ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో.. వచ్చే రెండేళ్లలో ఒరిజినల్ షోలు, సినిమాలు మరియు కో-ప్రొడక్షన్‌లలో హిందీ, తమిళంతో పాటు తెలుగులో 40 కొత్త టైటిల్స్‌ను విడుదల చేయనున్నట్లు గురువారం తెలిపింది. భారతదేశంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ, దేశంలోని ప్రైమ్ వీడియో స్టోర్‌తో పే-పర్-వ్యూ మూవీ సర్వీస్‌లోకి అడుగుపెడుతున్నట్లు, అలాగే రానున్న సంవత్సరాల లైసెన్సింగ్, ఒప్పందాలు మరియు వివిధ భారతీయ స్టూడియోలతో కో-ప్రొడక్షన్‌లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో హిందీ, తెలుగులో చిత్రాలతో…
ముంబైలో జరిగిన కళ్లు చెదిరే ఈవెంట్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో తెరపైకి రానున్న కొన్ని వెబ్ సిరీస్ ల లిస్ట్ ను ప్రకటించి,ప్రేక్షకులను థ్రిల్ చేసింది. భారతదేశంలో ట్రాన్సాక్షనల్ వీడియో-ఆన్-డిమాండ్ (TVOD) మూవీ రెంటల్ సర్వీస్‌ను ప్రారంభించడంతో పాటు, రాబోయే 2 సంవత్సరాలలో రానున్న తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కలిపి మొత్తం 40 కొత్త సిరీస్‌లు, సినిమాలు ప్రకటించి, అమెజాన్ అభిమానులను ఉత్సాహపరిచింది. కొత్త ప్రాజెక్టులతో పాటు మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్,…
బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజా చిత్రం ‘జల్సా’ ట్రైలర్ రిలీజ్ అయింది. మార్చి18న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘కల్పితం కంటే నిజం వింతైనది!’ అంటూ ట్వీట్ చేసింది విద్యాబాలన్. ఇందులో మీడియా ఛానెల్‌కు ఎడిటర్‌గా నటిస్తోంది విద్యాబాలన్. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విద్యా రాజకీయ నాయకుల అకృత్యాలను బహిర్గతం చేసే పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ప్రమాదానికి గురైన యువతి…
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం దూత అనే ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఇక తాజాగా ఈ సినిమాలో చైతూ సరసన మలయాళ ముద్దుగుమ్మలు నటించనున్నారు. మళయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్…
అమెజాన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సేవల ధరలను 50 శాతానికి తగ్గించింది. గతేడాది ప్రైమ్ సేవల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది తగ్గించిన ఈ తగ్గింపు అందరికీ కాదని అమెజాన్ పేర్కొన్నది. యూవతను ఆకట్టుకునేందుకు రెఫరల్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చింది. రిఫర్ చేసిన యూజర్ ప్రైమ్‌లో చేరితే, సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు వస్తుంది. Read: Pakistan: పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? యూత్…
దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన అర్బన్ రోమ్ కామ్ “గెహ్రైయాన్”. తాజాగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. “గెహ్రైయాన్” ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. అయితే టీజర్ తో తీవ్ర దుమారం రేపిన ఈ రొమాంటిక్ డ్రామాకు రిలీజ్ అయ్యాక మాత్రం మంచి స్పందన వచ్చింది. పెళ్లి తరువాత ఇలాంటి సీన్లలో నటించడం ఏంటి అంటూ విమర్శలు ఎదుర్కొన్న…
కొద్దికాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ డిజిటల్ మీడియాలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2013లో కర్నేష్ శర్మతో కలిసి అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుండి ‘ఎన్.హెచ్.10, ఫిల్లౌరి, పరి’ వంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించింది. తాజాగా ఆమె నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఏకంగా రూ. 405 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.…
అభినవ్ సర్దార్, చాందనీ, రామ్ కార్తీక్, షెర్రీ అగర్వాల్ లీడ్ రోల్స్ గా నటించిన చిత్రం ‘రామ్- అసుర్’. వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో అమెజాన్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కృత్రిమ వజ్రం తయారీపై తెరెకెక్కిన ఈ చిత్రంలో పీరియాడిక్ లవ్ స్టోరీతో పాటూ, కాంటెంపరరీ ప్రేమకథ…