బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజా చిత్రం ‘జల్సా’ ట్రైలర్ రిలీజ్ అయింది. మార్చి18న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘కల్పితం కంటే నిజం వింతైనది!’ అంటూ ట్వీట్ చేసింది విద్యాబాలన్. ఇందులో మీడియా ఛానెల్‌కు ఎడిటర్‌గా నటిస్తోంది విద్యాబాలన్. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విద్యా రాజకీయ నాయకుల అకృత్యాలను బహిర్గతం చేసే పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ప్రమాదానికి గురైన యువతి జీవితం వెనుక ఎవరెవరున్నారనే వాస్తవాలను బహిర్గతం చేయటం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందనే విషయం అర్థం అవుతుంది.
విద్యా ఇంట్లో పనిమనిషిగా నటి షెఫాలీ షా కనిపించనుంది. సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన ‘జల్సా’ ట్రైలర్ థ్రిల్లింగ్ గా ఆకట్టుకుంటోంది. షెఫాలి షా, రోహిణి హట్టంగడి, మానవ్ కౌల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను టిసీరీస్ పతాకంపై భూషణ్ కుమార్ తో కలసి కిషన్ కుమార్, శిఖా శర్మ, విక్రమ్ మల్హోత్రా నిర్మించారు. ఈ సినిమా విద్యాబాలన్ కు ఎలాంటి ఏరు తెస్తుందో చూడాలి.