నామినేటెడ్ పోస్టులు ఇవాళ ప్రకటించాల్సి ఉన్నా… రేపటికి వాయిదా పడింది… అయితే, కసరత్తు పూర్తి కాకపోవడంతో.. పోస్టుల ప్రకటన వాయిదా వేశామని.. రేపు ఉదయం వెల్లడిస్తామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి… నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్న ఆయన.. మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నాం.. కసరత్తులో కొంత అలస్యం అయ్యిందన్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సజ్జల.. పార్టీకోసం ముందు నుంచి పని చేస్తున్న వారు, సామాజిక న్యాయం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్…
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల ఇన్‌సైడ్‌ట్రేడిరగ్ జరిగిందనే ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయనే ప్రచారం జరుగుతున్నా వాస్తవంలో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ వాజ్యం సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే తేలవలసి వుంది. జులై 13న సుప్రీం కోర్టులో జస్టిస్ వినీత్ శరణ్, దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసు మంచి చెడ్డలతోపాటు ఎక్కడ విచారణ జరగాలనేదానిపైనా…
టిడిపి సీనియర్ ఎంఎల్‌ఎ, పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎపి ఆర్థిక నిర్వహణలలో 41వేల కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కులేఖ రాశారు. కాగ్ తరపున లతామల్లికార్జున్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌కు చాలా కాలం కిందటే రాసిన లేఖను తన ఫిర్యాదుతో జతచేశారు. ఈ 41 కోట్ల మొత్తానికి సంబంధించి సరైన లెక్కలు, రశీదులు వివరాలు లేవనిఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత దశలో కేంద్రం ఎపి ప్రభుత్వానికి రాసిన లేఖ ఒకటి…
అమరావతి రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఐఏఎస్ సాంబశివరావు, ఐఏఎస్సులు కాంతిలాల్ దండే, కోన శశిధర్లూ అక్రమాలకు సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంతిలాల్ దండే, కోన శశిధర్ సీఐడీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రికార్డులను ట్యాంపర్ చేశారని.. తుళ్లూరు మండలంలో అసైన్డ్ రికార్డులను మాయం చేశారని అధికారులపై అభియోగాలు ఉన్నాయి. read also : రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత ఇప్పటికే సీఐడీకి…
నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం… ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో గత స్థితి, ఇప్పటి పరిస్థితుల ఫోటోలను ప్రదర్శించాలని సూచించారు.. దీని కోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని స్పష్టం చేసింది సర్కార్.. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, సాంఘిక సంక్షేమం, పురపాలక, మహిళా సంక్షేమం తదితర శాఖలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల నిర్వహణకు గైడ్ లైన్స్ విడుదల చేశారు..…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నది. ముఖ్యమంత్రి సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించబోతున్నారు. తెలంగాణతో ఉన్న జలవివాదం గురించి ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఏపీలో ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్నది. …
ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే కరోనా బాదితులకు మందును పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇక కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆనందయ్య మందును ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. మొదటగా సర్వేపల్లి నియోజక వర్గంలోని ప్రజలకు అందించబోతున్నారు. ఆ…