అమరావతి భూముల వివాదంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆంధ్రప్రదేశ్ మైకోర్టు కొట్టివేయగా… హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది… ఇక, ఈ వ్యవహారంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు… తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది… ఇక, ఏపీ ప్రభుత్వ ఎస్.ఎల్.పి ని కోట్టివేసింది సుప్రీంకోర్టు.. దీంతో.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.