CM Chandrababu: మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రతన్ టాటా గొప్ప వ్యక్తి.. ఆయన సిoప్లీ సిటీ ఎంతో గొప్పది.. ఆయనతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది.
AP Capital Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం నిధులు సమీకరించుకునే పనిలో సీఆర్డీఏ పడింది. ఏడీబీతో కుదుర్చుకున్న రుణ ఒప్పందం మేరకు వచ్చే నాలుగేళ్లలో అమరావతి రాజధాని నగరంలో భూ విక్రయానికి ప్రణాళిక రచిస్తుంది.
P4 కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీ4 కార్యక్రమంపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు..
మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి కోర్టులో ఊరట లభించింది.. ఈ నెల 31వ తేదీ వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు పొడిగించింది.. కాగా, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ముందస్తు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు నాని..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో తన సింగపూర్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేబినెట్ సమావేశంలో సింగపూర్ టూర్‌పై స్పందించిన సీఎం.. గత ప్రభుత్వం హయాంలో సింగపూర్‌పై దుష్ప్రచారం చేశారు.. సింగపూర్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేశారు.. అయితే, మళ్లీ సింగపూర్ తో సంబంధాలు పునరుద్ధరణ కోసం ఈ టూర్ ఉపయోగపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
రాజధాని ప్రాంతం అమరావతి రైతులకు తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైతులకు సంబంధించిన 11వ ఏడాది కౌలు సొమ్మును విడుదల చేసింది సర్కార్.. 163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుండి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో పాటు, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం, పోర్టులు, సాంకేతిక, మౌళిక రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారం కోరనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ. సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
AP Cabinet: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతిలో 20, 494 ఎకరాల భూ సమీకరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.