గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. గడిచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది.