Amaravati R5 Zone: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ప్రాంతంలో…పేదల ఇళ్ళ పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. లే అవుట్‌లలో అభివృద్ధి కార్యక్రమాలు కొలిక్కి వచ్చాయి. రాజధాని ప్రాంతంలోని పేదల సొంత ఇంటి కల నేరవేరనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి.. శుక్రవారం లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన…వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు 50 వేల మంది లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల 392 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నారు. వీటిలో ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 741.93 ఎకరాల్లో 14 లే అవుట్లు వేశారు. వీటిని 27,532 మంది లబ్దిదారులకు అందించనున్నారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 650 ఎకరాల్లో 11 లే అవుట్లు వేసి అభివృద్ధి చేశారు. వీటిని 23వేల 860 మందికి ఇవ్వనున్నారు. ఇదే వేదిక పై నుంచి అమరావతి ప్రాంతంలోని 5వేల 24 టిడ్కో ఇళ్ల పంపిణీ కూడా చేపట్టనున్నారు. అమరావతి పరిధిలో మొత్తం 1402.58 ఏకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు పేదలకు ఇళ్ల ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ తీరుపై మంత్రులు ధ్వజమెత్తారు.
Read Also: Vande Bharat Trains: వచ్చే ఏడాది నాటికి 3 రకాల వందే భారత్ ట్రైన్లు.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాయ్. న్యాయ స్థానాలు కూడా సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని సమర్ధించాయి. అయినప్పటికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి జేఏసీ నిరసన కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా పట్టాల పంపిణి చేస్తుండటంతో…నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.