R5 Zone Layouts: ఆర్ ఫైవ్ జోన్‌లో లేఅవుట్లు రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R5 Zone Layouts: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ సాకారం కానుంది. కోర్టు కేసులు కొలిక్కి రావటం, అమరావతి రైతుల వ్యతిరేకత మధ్య ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం ఇవ్వనుంది. అమరావతి పరిధిలోని పలు గ్రామాల పరిధిలో సుమారు 1402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని లే అవుట్ లలో అభివృద్ధి ప్రక్రియ పూర్తి అయ్యింది. సరిహద్దు రాళ్లు వేయటమే కాకుండా వాటి పై నెంబరింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఆ యా లే అవుట్ల దగ్గర లే అవుట్ మ్యాప్ లను కూడా ప్రదర్శనకు పెట్టారు.
మరోవైపు వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు 50 వేల మంది లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా లే అవుట్ లలోనే సభ ఏర్పాటు చేయాలని భావించినా…గ్రామాల రహదారులు ఇరుకుగా ఉండటంతో సీడ్ యాక్సిస్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సభకు ఎంపిక చేశారు. ఆ పక్కన వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని ఏర్పాటు చేశారు.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
- Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా లాంఛనంగా పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత లబ్దిదారులకు షెడ్యూల్ తేదీలు ఖరారు చేసి వాటి ప్రకారం పట్టాలు అందజేస్తారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. మొత్తం లే అవుట్ స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాంటింగ్ చేశారు. మిగిలిన భూమిలో అంతర్గత రోడ్ల కోసం ఎక్కువ స్థలం కేటాయించారు. అప్రోచ్, అంతర్గత రోడ్లకు 36 శాతం భూమిని కేటాయించారు. మొత్తం ల్యాండ్లో 10 శాతం ఓపెన్ స్పేస్ గానూ, మిగిలిన భూమిని పార్కింగ్, యుటిలిటీ కోసం కేటాయించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల తయారీ కసరత్తు కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. ఆన్ లైన్ చేయటం, లబ్దిదారుల మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఎల్లుండి పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా చేపట్టనుంది.
తాజావార్తలు
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!