తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మంగళవారం 32 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రానున్న వేడిగాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లోని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read:Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీల జాతీయ గుర్తింపు రద్దు.. బీఆర్‌ఎస్‌కు షాక్
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏడు మండలాల్లో విపరీతమైన వేడిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రత కనిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనకాపల్లి జిల్లాలోని ఐదు మండలాలు, తూర్పుగోదావరిలోని రెండు మండలాలు, కాకినాడలోని ఆరు మండలాలు, పార్వతీపురం జిల్లాలోని ఆరు మండలాల్లో కూడా వడగాలులు వీస్తాయని అప్రమత్తం చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు (SDMA) ఈ జిల్లావాసులు వడదెబ్బలు, ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
Also Read:సెక్స్ కు ముందు వీటిని తింటున్నారా.. అయితే నీరుకారిపోవడమే
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు విశాఖపట్నం నగరం గత రెండు రోజులుగా వేడిగాలులతో అల్లాడిపోతోంది. వేడిని తట్టుకునేందుకు ప్రజలు కూలెంట్లను ఆశ్రయిస్తున్నారు. కొబ్బరి, నిమ్మ, చెరకు రసం, ఐస్ యాపిల్స్ (ముంజేలు) తదితర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.