Minister Narayana: రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉంది..
- రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు..
- కూల్చేసిన ప్రజావేదిక వద్ద నుంచి పర్యటన ప్రారంభమవుతుంది..
- ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. మంత్రులు.. జడ్జిలు.. అధికారుల క్వార్టర్లను పరిశీలిస్తారు..
- చివరగా సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసును సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ( గురువారం) రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు అని మంత్రి నారాయణ తెలిపారు. కూల్చేసిన ప్రజావేదిక దగ్గర నుంచి పర్యటన ప్రారంభమవుతుందన్నారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ముందుగా సందర్శిస్తారు.. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జడ్జిలు, అధికారుల క్వార్టర్లను పరిశీలించనున్నారు అని చెప్పారు. ఇక, చివరగా సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసును సీఎం చంద్రబాబు పరిశీలించిన తర్వాత అక్కడే మీడియాతో చంద్రబాబు మాట్లాడతారు అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Read Also: INDW vs SAW: సౌతాఫ్రికాపై శతకాలు బాదిన టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్..
Also Read
ఇక, ముందుగా కమిటీలు వేసి అమరావతి రాజధానిలో జరిగిన డ్యామేజీను పరిశీలిస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. టెండర్లకు పెట్టిన కాలపరిమితి ముగిసింది.. కాబట్టి కొత్తగా టెండర్లు పిలవాలి.. కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలుస్తామన్నారు. టెండర్లు కనీసం మూడు నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది.. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో సామాగ్రి దొంగిలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉంది.. న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!