రాజధాని నిర్మాణానికి 34000 ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమస్కారాలు తెలిపారు. అమరావతి రైతులు ఐదు సంవత్సరాలుగా నలిగిపోయారని.. రోడ్ల మీదకు వచ్చి, ముల్లకంచెలపై కూర్చొని, పోలీసులు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. 2000 రైతుల ప్రాణాలు కోల్పోయాయని చెప్పారు. రైతులు నలిగి బాధపడి, తమ కన్నీళ్లు తుడిచేవారు ఉన్నారా? అని చాలామంది మహిళలు రైతులు ఆ రోజుల్లో తను అడిగిన సన్నివేశాన్ని గుర్తు…
ఐదేళ్లపాటూ జగన్ తుగ్లక్ పాలనను అందించారని 2014 లో టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపేశారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నిలిపేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.64 వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులు రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నామన్నారు.
అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.
రామచంద్రాపురంలో జరిగిన ఘటనతో తాతాల్కికంగా తమ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు అమరావతి రైతులు.. పాదయాత్రకి నాలుగు రోజులు విరామం ప్రకటించారు.. పోలీసులు తీరుకు నిరసనగా పాదయాత్ర నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు… పోలీసుల తీరుపై కోర్టులో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రైతులు.. ప్రస్తుతం కోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో.. తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చామన్నారు.. అయితే, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి.. అమరావతి రైతుల మహాపాదయాత్రను పోలీసులు ఆపలేదని స్పష్టం చేశారు.. దీనిపై…
తమ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు అమరావతి రైతులు… పాదయాత్రకి నాలుగు రోజులు విరామం ప్రకటించారు.. పోలీసులు తీరుకు నిరసనగా పాదయాత్ర నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు… ఇక, పోలీసుల తీరుపై కోర్టులో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రైతులు.. ప్రస్తుతం కోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో.. తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.. అయితే, పాదయాత్రలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి… రామచంద్రాపురంలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది అమరావతి జేఏసీ.. దీంతో, ఇవాళ 41వ రోజు…