అమరావతి రైతుల పాదయాత్రపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు… ఇది రైతుల పాదయాత్ర కాదు.. ఒళ్లు బలిసినవాళ్లు చేస్తున్న పాదయాత్ర అని చెప్పాను.. ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నా… కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అది అంటూ మండిపడ్డారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కడుపు మండిన వారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబు మూల్యం చెల్లించకోక తప్పదు.. యాక్షన్ కు రియాక్షన్…
అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు… అమరావతి ప్రాంత భూముల స్కాం ఆరోపణల్లో కొత్త వాదన తెర మీదకు తీసుకుని వచ్చిన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుని తీరుతాం అన్నారు.. ఈ విషయంలో చర్చే అవసరం లేదన్న ఆయన.. శ్రీకాకుళం పోరాటాల గడ్డ.. మా ప్రాంతానికి వచ్చి మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా? అంటూ ఫైర్ అయ్యారు… ఇక, డిసెంబర్‌లో రాజధాని…
ఏపీ హైకోర్టులో ఇవాళ రిటైర్ అయిన జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. జస్టిస్ సత్యనారాయణ మూర్తికి ఘనంగా వీడ్కోలు పలికారు హైకోర్టు సీజే, సహచర న్యాయమూర్తులు, అడ్వకేట్లు. ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత కుమార్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ… హైకోర్టు జడ్జిగా జస్టిస్ సత్యనారాయణ మూర్తి అందించిన సేవలు అభినందనీయం. జస్టిస్ సత్యనారాయణ మూర్తి న్యాయమూర్తిగా అత్యధిక సంఖ్యలో 31వేలకు పైగా కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. జస్టిస్ సత్యనారాయణ…
ఏపీలో ఉప ఎన్నిక మాటున నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. సీపీఐ అగ్రనేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జగన్ పోటీచేయాలన్నారు నారాయణ. 900 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమాలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తోంది. న్యాయస్థానాలు సానుకూలంగా స్పందిస్తున్నా ముఖ్యమంత్రి వితండ వాదన చేస్తుండడం దారుణంగా వుందన్నారు. ఆనాడు అమరావతిలో రాజధానిని అంగీకరించారు. ప్రతిపక్షనేతగా ముందు అంగీకరించి ఇప్పుడు ఆడినమాట తప్పుతారా..? మోడీ కాళ్లు మోక్కినంత మాత్రాన జైలుకు పోకుండా ఎవరైనా ఆపగలరా..?ఆత్మకూరులో…
ఏపీలో అమరావతి విషయంలో ప్రభుత్వం తీరుని బీజేపీ తప్పుపడుతూనే వుంది. అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాజధాని పై హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.అఫిడవిట్ వివరాలు కోర్టు పరిధిలో ఉంటాయి. అయితే ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ప్లాట్లుకు పనులు పూర్తి చేసి ఇవ్వాలి.తగిన సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాకపోవడంతో రైతులు ఆందోళన…
ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ అవుతోంది. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్లు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. శుక్రవారం కేవియట్ పిటిషన్లను అడ్మిట్ చేసుకుంది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వస్తే తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వద్దని కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి రాజధానికి సంబంధించి మరో చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పిన…
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. 3 నెలల్లో ప్లాన్‌ను పూర్తిచేయాలని హైకోర్టు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి…
రాజధాని అమరావతిలో రైతులు ఉద్యమం ప్రారంభించి నేటితో సరిగ్గా 800 రోజులు అవుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి కోసం తాము ప్రాణ సమానమైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టడం.. పైగా మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడంతో అమరావతి రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. తమకు జరిగిన అన్యాయంపై నిరంతర పోరాటం సాగిస్తున్నారు. తమ…