Rahul Gandhi: ఏపీలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని.. అది అమరావతి మాత్రమే ఉండాలని తన అభిప్రాయంగా రాహుల్ గాంధీ తెలియజేశారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌పై…
Kishan Reddy: అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు దూకుడు ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకిచ్చారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాల్లో కక్షసాధింపు…
Dharmana Prasad Rao: విశాఖ రాజధాని విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో సీఎం జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ధర్మాన తెలిపారు. విశాఖ మన రాజధాని కావాలని, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమం చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు ఉద్యమంలోకి వెళ్లాలన్న ఆలోచన ఉందని.. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ధర్మాన స్పష్టం చేశారు. మరోవైపు అమరావతి రైతుల…
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు రెఫరెండంగా వచ్చే ఎన్నికలకు వెళ్లామంటున్న వైసీపీ ప్రభుత్వం.. దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేయాలని టీడీఎల్పీలో నిర్ణయించారు. జగన్‌కు అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసిరింది. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు…
Ambati Rambabu: అమరావతిపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి అనేదే పెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన ఐవీఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరిది ఈ రాజధాని’ అనే పుస్తకంలో ఏం రాశారో అందరూ తెలుసుకోవాలన్నారు. ఆయన బీజేపీలో ఉన్నారని.. కానీ ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలని…
Narayana Swamy: ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పశ్చిమ బైపాస్ పనులను పరిశీలించిన ౠయన రహదారి పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ బైపాస్ విస్తరణ తర్వాత అమరావతి ఒక జిల్లాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని..…
అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం తన కసరత్తు ప్రారంభించింది. పూలింగ్ గ్రామాలతో పాటు మూడు నాన్ పూలింగ్ గ్రామాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసే అమరావతి మున్సిపాల్టీలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి.. ప్రజాభిప్రాయాన్ని స్వీకరించే ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అయితే తొలి రోజు జరిగిన మూడు గ్రామసభల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకతే ఎదురైంది. అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అమరావతి క్యాపిటల్…
భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర దినోవత్స ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. మా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు జగన్. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రికరణే మా విధామని జగన్ పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, సమతౌల్యాన్నికి ఇదే…
National Lok Adalat: ఏపీ వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్పందన లభించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 380 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కరోజే ఏపీ వ్యాప్తంగా 94,263 కేసులు పరిష్కారం అయినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 87,805 పెండింగ్, 6,458 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నట్లు వివరించారు. ఆయా…