Andhra Pradesh BJP:ఏపీ బీజేపీ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందా? రాజధాని అమరావతి విషయంలో బీజేపీని అక్కడి రైతులు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రతికూల రాజకీయ వాతావరణంలో పాదయాత్రతో కమలనాథులకు ప్రయోజనం ఉందా? సోము వీర్రాజుకు రైతులు ఇచ్చిన షాక్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?
Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతిలో బీజేపీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మనం – మన అమరావతి’ పేరుతో బీజేపీ పాదయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుందని విజయసాయిరెడ్డి చెప్తున్నారని.. నిజంగానే ఏపీ…
Hindupuram YSRCP Conflicts: ఏపీలో అధికార పార్టీ వైసీపీలో మరోసారి వర్గపోరు బయటపడింది. హిందూపురంలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2014 ఎన్నికల్లో హిందూపురంలో పోటీ చేసిన నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల హిందూపురం ప్రెస్ క్లబ్ వేదికగా రెండు వర్గాల నేతలు రాళ్ల దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా వైసీపీ పెద్దల వద్దకు చేరింది. మంగళవారం నాడు హిందూపురం వైసీపీ…
అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ భూములను ఎకరా రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని ఆనాడు స్మశానం అని ప్రచారం చేసి ఈరోజు ఎకరం భూమి రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైసీపీ నేతలను లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి…
ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. కానీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధికి నిధుల కోసం సీఆర్‌డీఏ మరింత కసరత్తు చేస్తోంది. రాజధాని పరిధిలో పూర్తయిన భవనాలను లీజుకివ్వాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు చేసింది. రాజధానిలో గ్రూప్-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు…
రాజధాని అభివృద్ధి నిధుల సేకరణకు అమరావతిలోని భూములను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 248.34 ఎకరాలను అమ్మాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్ధారించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ 389 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. భూముల విక్రయం ద్వారా ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లను ప్రభుత్వం సేకరించనుంది. గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్…
ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ కేంద్రం.. ఈ రోజు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపోఆవరణములో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయని.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉండనుంది.. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలో.. ఈరోజు, రేపు…
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత నెల 3వ తేదీన హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్‌లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది. ఈనెల 3లోగా సీఆర్‌డీఏ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది.. దీంతో.. ఎవరి పదవి ఊడిపోతుంది..? కేబినెట్‌లో మిగిలేది ఎవరు? మాజీలు అయ్యేది ఎంత మంది? కొత్తగా పదవి దక్కించుకునేది ఎవరు? ఇలా ఏపీలో అధికార వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.. అయితే, కేబినెట్ నుంచి తప్పించినంత మాత్రాన వాళ్లను పక్కనబెట్టినట్టు కాదు.. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని.. మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. మాజీలు కానున్న మంత్రులతో సీఎం వైఎస్…
హైకోర్టు తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓవైపు.. లేదు మూడు రాజధానులే మా విధానం అంటూ మరోవైపు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, ఈ వ్యవహారంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఒకటికి పది సార్లు చెబుతున్నాం… మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. పాలనా వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్న ఆయన.. రాష్ట్ర విభజన…