Rain in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ద్రోణి బీహార్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగుతున్నది. మరోవైపు రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బలహీన పడింది.…
AP High Court Shifting to Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు తమ విధానం అని స్పష్టం చేసింది.. విశాఖ పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని పేర్కొంది.. అందులో భాగంగా త్వరలోనే విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మధ్యే మంత్రులకు తెలిపారు.. ఇక, కర్నూలుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. తెలుగుదేశం…
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.. అయితే, విపక్షాలు మాత్రం.. అమరావతే రాజధాని అని చెబుతున్నాయి.. మరోసారి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన ఆయన.. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం అని ప్రకటించారు.. అమరావతి రాజధాని అనే ఉద్దేశ్యంతోనే బెజవాడలో మూడు ఫ్లైఓవర్లు…
Maha Shivaratri 2023 Celebrations Live: మహా శివరాత్రి శుభవేళ ప్రసిద్ధ శైవక్షేత్రాలకు తాకిడి పెరిగింది.. శివనాస్మరణతో మార్మోగుతున్నాయి శైవక్షేత్రాలు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=JjoHKzREyLc
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై అప్పుడే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన.. కలిసి నడవాలని భావిస్తున్నాయి.. అయితే, ఇదే సమయంలో టీడీపీ పొత్తు విషయంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో.. జనసేన స్టాండ్ ఒకలా ఉంటే.. బీజేపీ స్టెప్పు మరోలా కనిపిస్తోంది.. ఈ సమయంలో పొత్తుల విషయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రాడ్యుయేట్…
High Court: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జగన్ ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో ఇతరులకు స్థలాలు కేటాయించడంపై కొందరు రైతులు హైకోర్టులో మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యే వరకూ భూములు వేరేవారికి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌లపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. కొత్తచట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని…
Amaravathi: అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్‌లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఉపశమనం ఇవ్వాలని అభిప్రాయపడింది. అయితే అమరావతి రాజధాని అంశంపై రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజధాని పరిధిలోని ఐదు గ్రామాలలో 900.97 ఎకరాలను కేటాయించింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు,…
CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం అయ్యారు. అమరావతి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఆయన్ను వర్మ కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు వర్మకు సీఎం జగన్ లంచ్ ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు జగన్, రామ్‌గోపాల్ వర్మ సమావేశం సాగింది. అనంతరం జగన్ నివాసం నుంచి వర్మ బయటకు వచ్చారు. అయితే జగన్‌తో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం కావడం ఇప్పుడు రాజకీయ,…
Amaravathi: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా…