వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేవారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. వివిధ అంశాలపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక, వైఎస్ వివేకా హత్యపై విచారణ అక్కర్లేదు..! నిందితులు ఎవరో బయటపడ్డారని వ్యాఖ్యానించారు.. వివేకాను చంపిందెవరో అందరికీ తెలిసిపోయిందన్న ఆయన.. ఆ హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలన్నారు… కానీ, ఇప్పుడు సీబీఐపై కూడా ఎదురు దాడి చేస్తున్నారని.. అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడికిపోతోంది అని ప్రశ్నించారు నారాయణ. Read…
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్) డిమాండ్ చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించడం సరికాదని ఆర్‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. దీనికంటే అమరావతి రాజధానిగా ఉంటేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని, కేంద్ర…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏం జరుగుతుందో ఎవరికి అంతు పట్టడం లేదు. ఇండస్ట్రీ ముద్దు బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం వెతికే దిశలో సీఎం జగన్ ని కలిసి చర్చలు జరిపారు. చిరుకు తోడుగా సినీ ప్రముఖులు కూడా ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. అయితే ఈ మీటింగ్ కి మంచు ఫ్యామిలీ కి ఆహ్వానం అందకపోవడంతో వారు కొంచెం అసహనమ్ వ్యక్తం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మంచు…
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీలో రాజధానిపై కలకలం రేగింది. దీంతో ఎంతో మంది రైతులు, తదితరులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకుంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే…
ఏపీ రాజధాని అమరావతిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ భవనాలే టార్గెట్‌గా దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. ఈ మేరకు నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల్లో విలువైన సామాన్లను దొంగలు దోచుకెళ్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్కనే రూ.110 కోట్లతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో దొంగలు ప్రవేశించి విలువైన ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లతో పాటు కరెంట్ వైర్లు, విలువైన ఎలక్ట్రికల్ సామాగ్రిని దోచుకుపోతున్నారు. ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు కొంతకాలంగా నిలిచిపోవడంతో దొంగలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మాణాలలో…
పోసాని కృష్ణ మురళి.. నోటికి ఏది వస్తే అది మాట్లాడి వివాదాలలో ఇరుక్కోవడం ఈయనకు కొత్తేమి కాదు. ఇక ఈ మధ్యన పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంటి మీద దాడి చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు పోసాని అజ్ఞాతంలోకి వెళ్లిన పోసాని ఆ మధ్యన మా ఎలక్షన్స్ లో మెరిసి మళ్లీ కనుమరుగయ్యారు. ఇక పోసాని టాపిక్ ని అంటారు మర్చిపోతున్న సమయంలో నేడు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమత్రి సీఎం జగన్ తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ ముగిసింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ, కమెడియన్ ఆలీ, నటుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను సీఎం కి తెలిపి ఒక పరిష్కారాన్ని కోరారు. ఇక భేటీ అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు..…
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూ రేపటితో ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో రేపు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఇక ఇప్పటికే ఒకసారి జగన్ ని కలిసిన చిరు టిక్కెట్ రేట్స్ ఇష్యూపై మాట్లాడిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయమై సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.. టెస్ట్‌ల సంఖ్య 40 వేల దగ్గరల్లో ఉన్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య 13 వేలకు పైగా ఉంటుంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,771 శాంపిల్స్ పరీక్షించగా.. 13,474 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 10,290 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మొత్తంగా.. ఇప్పటి…
డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్‌పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2),…