ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం తీవ్ర విధ్వంసానికి దారితీసింది.. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు జోడించడంపై ఓ వర్గం ఆందోళన చేస్తుండగా.. అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళితసంఘాలు నిరసనకు దిగుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేయాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. అంటూ…
అమలాపురంలో విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలను గుర్తించేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తించినట్టుగా తెలుస్తుండగా… ఈ ఘటనలో 7 కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. నిన్నటి ఘటనకి సంబంధించిన 7 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. ప్రస్తుతం 1000…
కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో ఒక్కసారిగా అమలాపురం అట్టుడికిపోయింది.. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు… మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇక, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.. దీంతో, అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, నిన్నటి ఘటనలో పాల్గొన్నవారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.. ఆందోళనకారులను గుర్తించే పనిలో పడింది విశాల్ గున్ని…
కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా.. చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.. ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.. టూవీలర్లపై వస్తున్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.. అమలాపురంలోకి ఎంట్రీ ఇచ్చే వాహనదారులు వివరాలు మొత్తం సేకరిస్తున్నారు.. ఇక, రోడ్లపైకి వచ్చే ఆందోళన చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. అమలాపురంలో పరిస్థితి అదుపులోనే ఉందన్న ఆయన.. విధ్వంస చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం…
కోనసీమ జిల్లా పేరు వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారిపోయింది.. ఆ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.. విధ్వంసం సృష్టించింది. మరోవైపు ఇవాళ కూడా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. ఇప్పటికే అమలాపురంలో కఠిన ఆంక్షలు విధించారు. బయట ప్రాంతాల నుంచి ఎవ్వరినీ అమలాపురంలోకి రానివ్వడంలేదు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు.. ఆర్టీసీ సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇక, కోనసీమకు సీనియర్ ఐపీఎస్‌లను పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Read Also: Dowry harassment:…
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.. అన్ని నెట్వర్క్ లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉన్నా.. మళ్లీ చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. నిన్న జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులు చక్కబడే వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అన్ని నెట్‌వర్క్‌లను ఆదేశించారు పోలీసు అధికారులు.. ఇక, వివిధ ప్రాంతాల…
కోనసీమ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ముఖ్యంగా అమలాపురం అయితే అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది.. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు.. అయితే, అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుండి భారీగా అమలాపురం చేరుకున్నారు పోలీసులు.. రాత్రి నుంచి అమలాపురంలో వర్షం కూడా కురుస్తుండడంతో.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అక్కడే మకాం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏలూరు డీఐజీ పాలరాజు..…
రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ పాలసీ అని ఒకటి వుంటుంది. తమ నిర్ణయాల వల్ల అంతా మంచి జరిగితే ఆ క్రెడిట్ అంతా మావల్లే జరిగిందని, తప్పు జరిగితే అది విపక్షాల కుట్ర అని నెపం నెట్టేయడం అన్నమాట. ఏపీలో అదే జరుగుతోంది. ప్రశాంతంగా వుండే కొనసీమ రణసీమగా మారింది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన…
కోనసీమ జిల్లా మార్పుపై అమలాపురంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోనసీమ సాధన సమితి మరో నిరసనకు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన వద్దకు భారీగా ప్రజలు చేరుకోవాలని, నిరసన చేపట్టాలని తెలిపింది. దీంతో బుధవారం ఏం జరుగుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అమలాపురంలో నిరసనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌బాబు ఇళ్లకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అటు…
అమలాపురంలో పరిస్థితి చేయిదాటిపోయింది. మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారు ఆందోళనకారులు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమలాపురం చేరుకున్నారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. కోనసీమకు అదనపు బలగాలు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు డీఐజీ పాలరాజు. ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు దగ్ధం చేశారు. ఆయన ఇంటికి కూడా నిప్పంటించారు ఆందోళనకారులు. అమలాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తతతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ని వివాదాల్లోకి లాక్కూడదన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్.…