అంతర్రాష్ట్ర కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ స్మగ్లింగ్ సిండికేట్‌ను నడుపుతున్నారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నోలోని అతని నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో బయటకు వచ్చిన అతని భవనం దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఆస్తి ప్రస్తుతం కస్టడీలో ఉన్న యూపీ పోలీసు కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్‌కు చెందినదేనని అధికారులు…